వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ నుండి కేంద్ర కేబినెట్ లోకి బీజేపీ నేత..!! సీఎం జగన్ కు సమస్యలా-సహకారమా..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించాలనేది ప్రధాని మోదీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాలు ఇప్పుడు కేంద్రానికి కీలకంగా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో..రానున్న ఎన్నికలు అందునా..ఉత్తర ప్రదేశ్ లో గెలుపు బీజేపీకి ప్రతిష్ఠాత్మక అంశంగా మారుతోంది. ఆ రాష్ట్రం లో ఇప్పటికే యోగి ప్రభుత్వానికి కేంద్రం చికిత్స ప్రారంభించింది.

ఏపీ నుండి ఆశావాహులు..

ఏపీ నుండి ఆశావాహులు..

ఇక, 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇప్పటి వరకు ఏపీ నుండి కేంద్ర మంత్రివర్గం లో ఎవరకీ స్థానం దక్కలేదు. టీడీపీ-బీజేపీ మైత్రి కొనసాగిన సమయంలో టీడీపీ నుండి ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో సభ్యులుగా ఉండేవారు. వారు బీజేపీ తో విభేదించి బయటకు వచ్చిన తరువాత కొత్తగా మంత్రులుగా ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇక, ఇప్పుడు ఏపీ నుండి బీజేపీ ఎంపీల్లో సురేష్ ప్రభు.. టీడీపీ నుండి బీజేపీలో చేరిన సజనా చౌదరి, టీజీ వెంకటేష్. సీఎం రమేష్ ఉన్నారు. వీరిలో సురేష్ ప్రభు..సుజనా చౌదరి..టీజీ వెంకటేష్ వచ్చే జూన్ లో పదవీ విరమణ చేయనున్నారు. ఇక, ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహా రావు ఉత్తరప్రదేశ్ నుండి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

జీవీఎల్ పేరుపై ప్రచారం..

జీవీఎల్ పేరుపై ప్రచారం..

ఆయన పార్టీ అధినాయక త్వానికి విధేయుడుగా గుర్తింపు పొందారు. రాష్ట్ర..జాతీయ అంశాల పైన అవగాహన ఉన్న వ్యక్తి. ఇక, ఏపీకి కేంద్రం నుండ అందుతున్న సాయం గురించి నిత్యం స్పందిస్తూ బీజేపీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తలతో టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ నుండి జీవీఎల్ నరసిహారావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నయి. అందులో జీవీఎల్ ఒక్కరే ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. కానీ, సామాజిక సమీరణాల్లో మాత్రం జీవీఎల్ కు పరిస్థితులు అనుకూలించే అవకాశాలు కనిపించటం లేదు. కానీ, ఏపీలో వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా ఉంటుండటంతో..కొత్త వారికి మంత్రి పదవి రాజ్యసభ సీటు కేటాయించే పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

 సమీకరణాలు కలిసొస్తాయా..అడ్డుపతాయా..

సమీకరణాలు కలిసొస్తాయా..అడ్డుపతాయా..

ఈ పరిస్థితుల్లో జీవీఎల్ కు ఏపీ నుండి ప్రాతినిధ్యం కల్పిస్తారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రెండేళ్ల కాలం ముగిసింది. ఏపీకి చెందిన నేతల్లో చాలా తక్కవ మందికి మాత్రమే గుర్తింపు లభించింది. ఇక, ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నా... కేంద్ర నాయకత్వం జీవీఎల్ వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణ పైన బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేయటం..వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తే అధికారం దక్కించుకోవటానికి అవకాశం ఉందని భావిస్తున్న సమయం లో అక్కడి నుండి ఇప్పుడున్న మంత్రికి అదనంగా మరో నేతకు కేంద్ర కేబినెట్ లో స్థానంలో కల్పిస్తారని చెబుతున్నారు.

Recommended Video

Sr NTR పై Fanism చాటుకున్న Megastar, 100వ జయంతికి రావాల్సిందే!! || Oneindia Telugu
జగన్ కు సమస్యలా..సహకరామా..

జగన్ కు సమస్యలా..సహకరామా..

అయితే, జీవీఎల్ కు ఇవ్వటం ద్వారా ముఖ్యమంత్రి జగన్ కు సమస్యలు ఏర్పడుతాయా అనే కోణంలోనూ వైసీపీలో చర్చ సాగుతోంది. కానీ, జీవీఎల్ అమరావతి విషయంలోనూ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించ లేదు. పార్టీ విధానం ఎలా ఉన్నా..కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయానికి అభ్యంతరం చెప్పదనే అంశాన్ని చెబుతూనే వచ్చారు. అదే విధంగా..జీవీఎల్ వివాదాలకు అతీతంగా ఉండటం కూడా ఇప్పులు సమీకరణాల్లో కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక, ఈ నిర్ణయం పైన ప్రధాని మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి..జీవీఎల్ పైన ఢిల్లీలో జరుగుతున్న ప్రచారానికి త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణ సమయంలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
News making rounds that GVL Narsimharao may be induced into Modi's cabinet from AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X