• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్ర మంత్రివర్గ విస్తరణ : తెర పైకి పవన్ కళ్యాణ్: పోటీలో టీడీపీ మాజీ నేతలు..దక్కేదెవరికి..!!

By Lekhaka
|

కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రధానిగా మోదీ రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండేళ్ల కాలం పూర్తయినా .. ఇప్పటి వరకు మంత్రివర్గంలో మార్పులు - చేర్పులు జరగలేదు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టటం.. మరో ఆరు నెలల కాలంలోనే అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో ప్రధాని మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం కేబినెట్ లో ప్రాతినిధ్యం ఉండేటా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ప్రాతినిధ్యం లేదు. కానీ, ఈ సారి తెలంగాణకు మరో మంత్రి పదవి ఇవ్వటంతో పాటుగా ఏపి నుండి ఒకరికి అవకాశం ఇవ్వాలని కమల నాధుల ఆలోచనగా తెలుస్తోంది.

 ఏపీ నుండి దక్కేదెవరికి..

ఏపీ నుండి దక్కేదెవరికి..

ఏపీలో ఎలాగైనా టీడీపీ స్థానంలో తాము ఎదుగుతామని చెబుతున్న బీజేపీ నేతలు ఆ దిశగా కేంద్ర మంత్రి నియామకం ద్వారా అడుగులు వేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నుండి బీజేపీకి లోక్ సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభ నుండి జీవీఎల్ నరసింహారావు ఒక్కరే ఉన్నారు. వాస్తవంగా ఆయన ఉత్తరప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ నుండి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా సురేష ప్రభు ఉన్నారు. అయితే, జీవీఎల్ అటు కేంద్ర నేతలతో సత్సంబంధాలే..పార్టీకి విధేయుడనే పేరు ఉంది. దీంతో..ఆయనకు అవకాశం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. పురంధేశ్వరి వంటి వారి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. కానీ, ఏపీలో సామాజిక సమీకరణాలే రాజకీయాలను డిసైడ్ చేసే స్థాయిలో ఉండటంతో...ఎవరికి కేంద్ర మంత్రి ఇస్తారనే అంశం పైన రక రకాల విశ్లేషణలు మొదలయ్యాయి.

 టీడీపీ మాజీ నేతలకు ఛాన్స్ ఇస్తారా..

టీడీపీ మాజీ నేతలకు ఛాన్స్ ఇస్తారా..

టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి...సీఎం రమేష్.. టీజీ వెంకటేష్ సైతం కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నారు. వారిలో సుజనా చౌదరి గతంలోనూ మంత్రిగా చేసి ఉన్నారు. సీఎం రమేష్ బీజేపీకి రాజ్యసభలో కొన్ని సందర్భాల్లో కీలకంగా వ్యవహరించారు. ఫ్లోరే మేనేజ్ మెంట్ లో చురుకుగా పని చేసారు. ఇక, టీజీ వెంకటేష్ కు బీజేపీ అధినాయకత్వంలో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. అయితే, కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిని చేయటం.. జనసేనతో పొత్తు పెట్టుకోవటం ద్వారా కొత్త సామాజిక వ్యూహం అమలు చేయాలని బీజేపీ భావించింది. అయితే, కరోనా..ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలతో ఏపీ పైన ఫోకస్ పెట్టలేదు. ఇక, ఇప్పుడు ఎన్డీఏ నుండి మిత్రపక్షాలు దూరం అవుతున్న సమయంలో.. తమతో కలిసి పని చేసేందుకు ఆసక్తితో ఉన్న మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది.

 తెర పైకి పవన కళ్యాణ్ పేరు..

తెర పైకి పవన కళ్యాణ్ పేరు..

అందులో భాగంగా..ఏపీలో పొత్తు కుదుర్చుకున్న జనసేన పార్టీకి అవకాశం ఇస్తారనే ప్రచారమూ సాగుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తమకు తగిన గుర్తింపు బీజేపీ నేతలు ఇవ్వటం లేదనే భావన జనసైనికుల్లో ఉంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పవన్ సైతం ఇదే అభిప్రాయాన్ని ఓపెన్ గానే చెప్పారు. వపన్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వటం ద్వారా తెలంగాణలోనూ ఆయన ద్వారా బీజేపీకి ప్రయోజనం ఉంటుందని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ను ఎదుర్కోవాలంటే జనాకర్షణ కలిగిన నేత అవసరమని..అందుకు పవన్ కు కేంద్ర మంత్రి ఇవ్వటం అవసరమని ఆర్ఎస్ఎస్ లో కీలకంగా వ్యవహరించే ఒక ముఖ్య నేత బీజేపీ అధినాయకత్వం వద్ద ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో అదే నేత పవన్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశంలో ..పొత్తు అంశంలో కీలకంగా వ్యవహరించారు.

 కసరత్తు కొలిక్కి వచ్చాక స్పష్టత..

కసరత్తు కొలిక్కి వచ్చాక స్పష్టత..

బీజేపీ అనుబంధ విభాగానికి చెందిన మరో యువ నేత సైతం ఆ దిశగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందు కోసం త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏ రాష్ట్రం నుండి అయినా పవన్ కు అవకాశం కల్పించవచ్చని..ముందుగా మంత్రి పదవి ఇవ్వటం మంచిదని వారికి సూచించినట్లుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతలు చేస్తున్న కసరత్తు కొలిక్కి వస్తే..ఏపీకి బెర్తు విషయం లో పవన్ తో సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక మినహా మరెక్కడా బీజేపీ బలంగా లేదు. తెలంగాణ లో గట్టి పోటీ ఇస్తామని ఆ పార్టీ జాతీయ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ- ఏపీ లో ఉమ్మడి రాజకీయ అంశాలు ముడి పడి ఉండటంతో బీజేపీ ఏపీకి ప్రాతినిధ్యం కల్పిస్తుందనేది కమల నాధుల వాదన. ఇన్ని రకాల సమీకరణాల నడుమ బీజేపీ అధినాయకత్వ నిర్ణయం ఏ రకంగా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
As there is a central cabinet expansion soon, Pawan Kalyan from AP may get a cabinet post according to RSS sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X