వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కళ్యాణ్‌కు షాక్: ఓడించే శక్తి ఉంటే ఎవరు కాదన్నారు: కేంద్ర మంత్రి ఆశోక్ షాకింగ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయనగరం: కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతి రాజు మరోసారి జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. పవన్‌తో పాటు వైసీపీ చీఫ్ జగన్ తీరును ఆశో‌క్ గజపతిరాజు తప్పుబట్టారు. టిడిపిని ఓడించే శక్తి ఉంటే ఎవరు కాదంటారని ఆయన ప్రశ్నించారు.

చాలా కాలం తర్వాత కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు మరోసారి జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌పై చురకలు అంటించారు. రాజకీయాల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆశోక్‌గజపతి రాజు స్పందించారు.

తన కుటంబం ఏ రకంగా ప్రజలకు సేవ చేసిందో ఆయన ప్రస్తావించారు. కొందరు ప్రజలతో ఏ రకంగా ఉంటారో కూడ ఆయన ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన పద్దతులకు భిన్నంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఆశోక్‌గజపతిరాజు వ్యక్తం చేశారు.

మోడీ మెచ్చిన ఆశోక్‌: విఐపీ కల్చర్‌కు దూరంగా, రాజ కుటుంబం నుండి వచ్చి ఇలా...మోడీ మెచ్చిన ఆశోక్‌: విఐపీ కల్చర్‌కు దూరంగా, రాజ కుటుంబం నుండి వచ్చి ఇలా...

ఓడించే శక్తి ఉంటే ఎవరు కాదన్నారు.

ఓడించే శక్తి ఉంటే ఎవరు కాదన్నారు.

టిడిపిని ఓడించే శక్తి ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతి రాజు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఓడించే శక్తి ఉంటే ఎవరు కాదంటరని ఆయన ప్రశ్నించారు.ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆశోక్ గజపతిరాజు చెప్పారు. అయితే అదే సమయంలో గెలుపు ఓటములు కూడ సహజమేనని ఆయన చెప్పారు. తాను 8 దఫాలు ఎన్నికల్లో పోటీ చేస్తే 7 దఫాలు విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అసెంబ్లీకి వెళ్ళకపోవడమేమిటీ

అసెంబ్లీకి వెళ్ళకపోవడమేమిటీ

ఏపీలో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడాన్ని కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు ప్రస్తావించారు. ఈ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. పని చేయమంటారు. అసెంబ్లీకి వెళ్ళమంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ ఓ వేదికగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం వల్ల ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు.

బాధ్యత ఉన్న వారినే ప్రజలు ప్రోత్సహిస్తారు

బాధ్యత ఉన్న వారినే ప్రజలు ప్రోత్సహిస్తారు

బాధ్యత ఉన్న వారినే ప్రజలు ప్రోత్సహిస్తారని ఆశోక్ గజపతి రాజు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎంత మంది పోటీ చేసినా ఒక్కరే విజయం సాధిస్తారని ఆయన చెప్పారు.అయితే ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ప్రజలు భావిస్తే వారికే ఓటు వేసి గెలిపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

నా ఆనందం వేరే, మరికొందరు మద్యం పోయిస్తే ఆనందం

నా ఆనందం వేరే, మరికొందరు మద్యం పోయిస్తే ఆనందం

తమ కుటుంబం పేదలకు సేవ చేసేందుకు పడిన తాపత్రయాన్ని ఆశో‌క్‌గజపతిరాజు ప్రస్తావించారు.తన తాత చదువుకొనే పిల్లల కోసం భోజన వసతిని 1934లో కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. తన తండ్రి భోజనంతో పాటు చదువుకొనే వసతిని కూడ కల్పించారని ఆయన గుర్తు చేశారు. సింహచలం దేవాలయానికి 350 ఎకరాల భూమిని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ రకమైన కార్యక్రమాలు తనకు ఆనందాన్ని ఇస్తాయని ఆయన చెప్పారు. మరో వైపు కొందరికి మద్యం పోయిస్తే ఆనందం కలుగుతోందని ఆయన పరోక్షంగా విపక్ష నేతపై విమర్శలు గుప్పించారు.

English summary
Union minister Ashok gajapati Raju made allegations on Ysrcp, Janasena parties on Monday. why Ysrcp decided to boycott assembly he asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X