తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, వైసీపీ ఎంపీ సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

తిరుమల: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనం సందర్భంగా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం శనివారం మధ్యాహ్నమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. అనంతరం పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.

ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి తిరుమ‌ల తిరుపతి దేవస్థానం ప్ర‌త్యేకాధికారి ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మ‌లా సీతారామ‌న్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని ప్ర‌త్యేకాధికారి అంద‌జేశారు.

Union Minister Nirmala Sitaraman offered prayers to Lord Balaji in Tirumala
Union Minister Nirmala Sitaraman offered prayers to Lord Balaji in Tirumala

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సివిఎస్‌వో గోపినాథ్ జెట్టి, ఆల‌య డిప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ లోక‌నాథం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Union Minister Nirmala Sitaraman offered prayers to Lord Balaji in Tirumala
English summary
Union Minister for Finance Smt Nirmala Sitaraman offered prayers in the Hill Shrine of Sri Venkateswara Swamy on Sunday morning. After darshan, she was rendered Vedasirvachanam by the vedaparayanamdars of the temple at Ranganayakula Mandapam. Nirmala Sitaraman accompanied by YSR Congress Party Rajya Sabha member V Vijayasai Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X