చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సొంత నియోజకవర్గంలో రోజాకు చేదు: దాడికి యత్నం, అడ్డుకున్న వైసీపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

నగరి: చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెపై దాడి ప్రయత్నం జరిగింది. ఈ సంఘటన బుధవారం జరిగింది. పుత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి అదనపు భవన ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.

పవన్‌కు దాడి షాకిచ్చారా?: చంద్రబాబూ! మీఅద్భుతాలు చాలు, మోడీకి చెప్పగా విన్నానుపవన్‌కు దాడి షాకిచ్చారా?: చంద్రబాబూ! మీఅద్భుతాలు చాలు, మోడీకి చెప్పగా విన్నాను

రోజాపై దాడి ప్రయత్నం

రోజాపై దాడి ప్రయత్నం

టీడీపీ నేత, మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్న సమయంలోనే ఈ దాడి ప్రయత్నం జరిగిందని తెలుస్తోంది. ఈ పని తెలుగుదేశం పార్టీ వారిదేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం పూత్తురులో మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా భవన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Recommended Video

కేసీఆర్ కాళ్లు పట్టుకోడానికే దేవినేని : రోజా
 రోజా రాకను నిరసిస్తూ నినాదాలు

రోజా రాకను నిరసిస్తూ నినాదాలు


ఈ కార్యక్రమానికి హాజరైన రోజాను పలువురు అడ్డుకున్నారు. రోజా రాకను నిరసిస్తూ వారు నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా వైసీపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అంతేకాదు, వారు ఆమె పైన దాడికి ప్రయత్నాలు చేయగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.

సొంత జిల్లాలో నట్టేట ముంచుతున్నారు

సొంత జిల్లాలో నట్టేట ముంచుతున్నారు

అంతకుముందు రోజా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. మొన్న టమోటా, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డున పడ్డారన్నారు.

 రోడ్డుపై వేసి నిరసన తెలిపారు

రోడ్డుపై వేసి నిరసన తెలిపారు

మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కారన్నారు. ఇది చంద్రబాబు సర్కారుకు సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. రైతుల మీద చంద్రబాబుది దొంగ ప్రేమ అన్నారు. రైతులు మామిడికాయలను రోడ్డుపై వేసి తమ నిరసన తెలిపారని రోజా గుర్తు చేశారు.

English summary
It is said that Unknown people tries to attack YSR Congress Party MLA Roja on Wednesday in Nagari constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X