వ్యాక్సిన్ వికటించి ఒంగోలు డాక్టర్ కండీషన్ సీరియస్ , చెన్నై ఆస్పత్రికి తరలింపు, అంగన్వాడీ కార్యకర్తకూ అస్వస్థత
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కరోనా మహమ్మారిని అంతమొందించడానికి మొదలుపెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొంతమందిలో వ్యాక్సిన్లు వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్న వారు లేకపోలేదు. అయితే లక్షల సంఖ్యలో వ్యాక్సినేషన్ చేసినా పదుల సంఖ్యలోనే వ్యాక్సిన్ తీసుకున్నవారికి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ భయం .. బ్రిటన్ నుండి వచ్చిన 15 మందికి పాజిటివ్

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఒక యువ డాక్టర్ కు తీవ్ర అస్వస్థత
తాజాగా ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఒక యువ డాక్టర్ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కు చెందిన ధనలక్ష్మి ఒంగోలు రిమ్స్ లో డాక్టర్ గా పని చేస్తున్నారు. ఈనెల 23వ తేదీన ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత 24వ తేదీ నుండి డాక్టర్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెకు రిమ్స్ లో చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేదు. జ్వరం ఎక్కువ కావడం తో పాటుగా ఒక్కసారిగా బిపి తగ్గిపోయింది.

మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై అపోలోకు తరలింపు
దీంతో వెంటనే అప్రమత్తమైన జీహెచ్ వైద్యులు చికిత్స కోసం సంఘమిత్ర ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా వ్యాక్సినేషన్ కార్యక్రమం మాత్రం కొనసాగుతుంది.
ఇక మరో ఘటనలో రెండు రోజుల క్రితం వ్యాక్సిన్ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్త తప్పి పడిపోయింది .

స్పృహ తప్పి పడిపోయిన అంగన్వాడీ కార్యకర్త .. ఆస్పత్రిలో చేరిక
గుంటూరులో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల ధర్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తోటి అంగన్వాడి కార్యకర్తలు ఆమెను జీహెచ్ కు తరలించారు. 2 రోజుల క్రితం కార్యకర్త వ్యాక్సిన్ తీసుకున్న నేపథ్యంలో, వ్యాక్సిన్ వల్లనే జరిగిందా అన్న అనుమానం వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దూసుకుపోతున్న భారతదేశం ప్రపంచంలోని టాప్ టెన్ వ్యాక్సినేషన్ చేస్తున్న దేశాల జాబితాలో చేరింది. ప్రణాళిక ప్రకారం వ్యాక్సిన్లను ఇస్తూ భారత్ కరోనా నివారణ కోసం తనదైన కీలక పాత్ర పోషిస్తోంది.