• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Video: థియేటర్ అద్దాలు బద్దలుకొట్టిన ఫ్యాన్స్... పవన్ 'వకీల్ సాబ్' దేశవ్యాప్తంగా హాట్ టాపిక్...

|

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 'వకీల్ సాబ్' మేనియా నడుస్తోంది. పవన్ ఫ్యాన్స్ అంతా వకీల్ సాబ్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. సోమవారం(మార్చి 29) సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేశారు. వందలాదిగా థియేటర్లకు తరలివచ్చి అభిమాన హీరో ట్రైలర్‌ను వీక్షించి పండగ చేసుకున్నారు. అయితే కొన్నిచోట్ల అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్‌లో థియేటర్ అద్దాలు బద్దలుకొట్టి మరీ లోపలికి దూసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

థియేటర్ అద్దాలు బద్దలుకొట్టిన ఫ్యాన్స్...


తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలే అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్‌‌ను విడుదల చేయడంతో థియేటర్లకు అభిమానులు పోటెత్తారు. ఇదే క్రమంలో విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్‌‌కు వందలాదిగా అభిమానులు తరలివచ్చారు. అంతమందిని అదుపుచేయలేక అక్కడున్న సెక్యూరిటీ చేతులెత్తేశారు. దీంతో థియేటర్ అద్దాలు బద్దలుకొట్టి మరీ పవన్ ఫ్యాన్స్‌ లోపలికి వెళ్లారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. జాతీయ మీడియాలోనూ దీనిపై చర్చ జరుగుతోంది.

పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్...

పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్...


అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్ల గ్యాప్‌ తీసుకుని పవన్ కల్యాణ్ నటించిన సినిమా వకీల్ సాబ్. పవన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాక... మళ్లీ ఆయన్ను వెండితెరపై చూస్తామో లేదోనని చాలామంది అభిమానులు బెంగ పెట్టుకున్నారు. అయితే ఎట్టకేలకు పవర్ స్టార్ మళ్లీ వకీల్ సాబ్‌ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోమవారం రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే రికార్డు స్థాయిలో 13 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.

మోగిపోతున్న టికెట్ రేట్లు...!!

మోగిపోతున్న టికెట్ రేట్లు...!!


మరోవైపు వకీల్ సాబ్ సినిమా టికెట్లను విపరీతంగా పెంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్స్ రూ.1500గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్నింగ్ షోస్‌కి రూ.500, రన్నింగ్ షోస్‌కి రూ.200 నుంచి రూ.250 టికెట్ ధరలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సినిమాలకు ఫస్ట్ డే హడావుడి ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో వకీల్ సాబ్‌ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు టికెట్ రేట్లను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. అయితే మరీ ఈ స్థాయిలో టికెట్ ధరలు సామాన్య ప్రేక్షకులను దోపిడీ చేయడమేనన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా భారీగా పెంచిన టికెట్ రేట్లతో వకీల్ సాబ్ సినిమా మొదటిరోజే రికార్డులను తిరగరాయడం ఖాయమంటున్నారు.

క్లాసిక్ హిట్ పింక్‌కి రీమేక్‌గా...

క్లాసిక్ హిట్ పింక్‌కి రీమేక్‌గా...


బాలీవుడ్ క్లాసిక్ హిట్ పింక్‌కి వకీల్ సాబ్ రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. హిందీలో విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. హిందీలో తాప్సీ,అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నివేదా థామస్,పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ రూ.50కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. కాగా,తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు సరిగ్గా వారం రోజుల ముందు ఈ సినిమా విడుదలవుతుండటం గమనార్హం. తిరుపతి లోక్‌సభలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్నారు.

English summary
The fans of Telugu superstar Pawan Kalyan created a huge ruckus at the Sangam Sharath theatre in Andhra Pradesh’s Visakhapatnam on Monday as the trailer of his upcoming movie Vakeel Saab was released with much fanfare. The actor-turned-politician decided to release the trailer of his anticipated film on the occasion of Holi and the fans headed to a few selected theatres to celebrate their favourite star.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X