వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడి కత్తి దాడి, అలిపిరి ఎవరి కుట్రలు, రాజేంద్రప్రసాద్ ఏమన్నారు..? వంశీ ఏం చెప్పారు..?

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసేందుకు తాను సిద్దమేనని వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. గన్నవరం నుంచి పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను రిజైన్ చేస్తా.. మరో పరోక్ష పద్ధతిలో ఎమ్మెల్సీ పదవీని అట్టిపెట్టుకున్న లోకేశ్ సంగతి ఏంటీ అని ప్రశ్నించారు. తననేమో రాజీనామా చేయమని అడుగుతరు.. మరీ లోకేశ్ ఎందుకు రిజైన్ చేయరని నిలదీశారు. టీవీ డిబేట్‌లో రాజేంద్రప్రసాద్‌‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు మీడియాముఖంగా క్షమాపణ చెప్పారు. పనిలోపనిగా రాజేంద్రప్రసాద్, కోడెల శివప్రసాద్, చంద్రబాబు, లోకేశ్ వైఖరిపై మండిపడ్డారు.

పక్కదారి పట్టించారు..

పక్కదారి పట్టించారు..

తాను అడిగింది ఇంగ్లీష్ మీడియం, సిమెంట్ గురించి అడిగితే.. సమస్యను పక్కదారి పట్టించారని వంశీ ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం జగన్‌తో సమావేశమయ్యానని గుర్తుచేశారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ నేర్పితే తప్పేంటి అని ప్రశ్నించారు. తెలుగు మీడియంలో పడ్డ ఇబ్బందులతో స్వాగతించానని పేర్కొన్నారు. కానీ రాజేంద్రప్రసాద్ తనను చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని డిస్కషన్ మొదలు పెట్టారని గుర్తుచేశారు.

నరం లేని నాలుక

నరం లేని నాలుక

రాజేంద్రప్రసాద్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జగన్‌పై కోడి కత్తి దాడి చేసిన సమయంలో విజయమ్మ, షర్మిల చేయించారని తెలిపారు. అతని నాలికకు అల్జిమర్స్ వచ్చిందనే అంశం తెలియదని పేర్కొన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై మావోయిస్టులు దాడి చేస్తే భువనేశ్వరి, లోకేశ్ వేశారని కామెంట్ చేశారని గుర్తుచేశారు. రాజేంద్రప్రసాద్‌లా ఏకకాలంలో టోక్యో, సింగపూర్, న్యూయార్క్ వెళ్లి మాట్లాడలేనని దుయ్యబట్టారు.

దండం పెడితే తప్పా..?

దండం పెడితే తప్పా..?


చంద్రబాబు తన తండ్రి సమానులు కాబట్టి కాళ్లకు దండం పెట్టానని వంశీ అంగీకరించారు. ఇప్పటికే పెద్దలను గౌరవిస్తానని చెప్పారు. పూజార్లకు పాదాభివందనం చేస్తానని తెలిపారు. మీరు చంద్రబాబు కాళ్లు పట్టుకోవడం లేదా అని వంశీ ప్రశ్నించారు. వాసుదేవుడు గాడిద పళ్లు పట్టుకున్నారని ప్రస్తావించానా అని వంశీ ఎద్దెవా చేశారు.

ఎన్నికల ఫండే..

ఎన్నికల ఫండే..


తనకు చంద్రబాబు కోట్లు ఇచ్చారని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ ఇచ్చారే తప్ప వ్యక్తిగత వ్యసనాల కోసం ఇచ్చారా అని వంశీ నిలదీశారు. ఇంటి కోసం ఇచ్చారా.. చేపల చెరువుల కోసం ఇచ్చారా అని ప్రశ్నించారు. 2014లో పార్టీ ఫండ్ ఇవ్వలేదని.. 2019లో మాత్రం అందరీ లాగే ఇచ్చారని పేర్కొన్నారు.

 టాబ్లెట్స్ వేసుకోలేదు

టాబ్లెట్స్ వేసుకోలేదు

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో బాధపడ్డానని వంశీ పేర్కొన్నారు. వారిలా తాను మాత్రలు వేసుకోలేనని.. అందుకోసమ ప్రావీణ్యంగా, ఆలోచించి మాట్లాడలేనని పేర్కొన్నారు. అయ్యప్ప మాల వేసి దూషించారని అంటున్నారు.. మరి రాజేంద్రప్రసాద్ ఎందుకు తిట్ల దండకం చదివారు అని వంశీ నిలదీశారు. తిరుమలలో వేయికాళ్ల మండపాన్ని కూల్చానా ? విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు చేశానా అని వంశీ ప్రశ్నించారు. సరస్వతీ స్వామిని కలిసేందుకు ఎవరెవరు వస్తారో సీసీ కెమెరాల్లో చూసింది ఎవరు అని వంశీ నిలదీశారు. తాను ఏమైనా టీటీడీ బోర్డు డైరెక్టర్, చైర్మన్ పదవులను అమ్ముకున్నానా అని వంశీ కొశ్చన్ చేశారు. కానీ కొందరు దీనిని కుల, మతాల మధ్య కుంపటి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

English summary
vallabhaneni vamsi sorry to rajendra prasad. he criticize chandrababu, lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X