విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దయచేసి ఆ నిర్ణయం వద్దు: బాబుకు వల్లభనేని వంశీ విన్నపం

డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. గురువారం ఉదయం చంద్రబాబును వంశీ కలిశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. గురువారం ఉదయం చంద్రబాబును వంశీ కలిశారు. డెల్టా షుగర్ ఫ్యాక్టరీ రైతులతో కలిసి ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

Recommended Video

అసెంబ్లీలో టిడిపి వ్యూహం : వైసీపీ నేతల గురించి మాట్లాడకూడదని ఇలా...! | Oneindia Telugu

అయితే, రైతులందర్నీ క్యాంపు కార్యాలయంలోనికి అనుమతించకపోవడంతో వంశీ మాత్రమే చంద్రబాబును కలిసి ఈ విషయంపై మాట్లాడారు. డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేస్తే చెరకు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు.

vallabhaneni vamsi met CM Chandrababu on farmers issue

అంతేగాక, చెరకును హనుమాన్ జంక్షన్ నుంచి ఉయ్యూరుకు తరలించాల్సి వస్తుందని చంద్రబాబుకు వివరించారు. దీంతో 30-40కిలోమీటర్ల దూరం పెరుగుతుందని, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయని చెప్పారు.

ఈ సమస్యలను పరిగణలోకి తీసుకుని.. ఫ్యాక్టరీని మూసివేయకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వంశీ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వంశీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

English summary
TDP MLA Vallabhaneni Vamsi on Thursday met Andhra Pradesh CM Chandrababu Naidu to discus on sugarcane farmers issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X