వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను..ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: చంద్రబాబుకు భయం..పప్పుబ్యాచ్ అంటూ: సభలో వల్లభనేని వంశీ సంచలనం

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసనసభలో వల్లభనేని వంశీ కీలక ప్రతిపాదన చేసారు. తాను టీడీపీ సభ్యుడిగా కొనసాగలేనని..తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని అభ్యర్ధించారు. వంశీ ప్రతిపాదన ను పరిశీలిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చని సూచించారు. వల్లభనేని వంశీ మాట్లాడేందుకు ప్రయత్నించే సమయంలో ఆయనకు అనుమతి ఇవ్వటం పైన చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. తాను నియజకవర్గ సమస్యల మీదనే ముఖ్యమంత్రిని కలిసానని వంశీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో టీడీపీ వ్యవహార శైలి మీద స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తరువాత వంశీ కోరిన విధంగా అందుబాటులో ఉన్న సీటును కేటాయించాలని స్పీకర్ శాసనసభా కార్యదర్శిని ఆదేశించారు. ఆ సమయంలో టీడీపీ వాకౌట్ చేసింది.

నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి..

నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి..


టీడీపీ నుండి గెలిచిన తాను..జరిగిన పరిణామాలతో తాను టీడీపీ సభ్యుడిగా కొనసాగలేనని..తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని వంశీ సభా వేదికగా స్పీకర్ ను కోరారు. తాను నియోజకవర్గంలో సమస్యల మీదనే ముఖ్యమంత్రిని కలిసానని వివరించారు. తన నియోజకవర్గంలో మోటార్లకు విద్యుత్ ఇవ్వాలని..అదే విధంగా నివేసన స్థలాల గురించి చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలవగా..ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఇంగ్లీషు మీడియం పాఠశాలలు.. అదే విధంగా ఫీజు రీయంబర్స్ మెంట్ ను తాను మద్దతిచ్చానని వివరించారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లుగా మీడియా ద్వారా తెలిసందని..కానీ తాను టీడీపీలో గెలిచినా.. తాను టీడీపీతో కలిసి ఉండలేనని..నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యేగా కొనసాగుతానని..దీంతో, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి సీటు కేటాయించాలని వంశీ స్పీకర్ ను కోరారు.

చంద్రబాబు..లోకేశ్ మీద వంశీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు..లోకేశ్ మీద వంశీ కీలక వ్యాఖ్యలు

ప్రశ్నోత్తరాల ప్రారంభ సమయంలో వంశీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. వంశీకి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వటాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో..వంశీ సైతం సీరియస్ అయ్యారు. చంద్రబాబు గారు..మీకు ఎందుకు అభ్యంతరం..మేము మాట్లాడకూడదా..మాకు హక్కులుండవా అని ప్రశ్నించారు. అదే విధంగా తాను ప్రభుత్వం విధానాలకు మద్దతు ఇవ్వటం పైనా పప్పుబ్యాచ్..కులం పేరుతో..తల్లి తండ్రులను కించపరుస్తూ సోషల్ మీడియాలో తీవ్రంగా పరుష పదజాలంలో విమర్శలు చేసారని వివరించారు. పప్పు బ్యాచ్ జనంలో తిరగరని..జయంతికి..వర్దంతికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎందుకంత భయమని..బయటకు ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని..కోటంరెడ్డి సైతం ప్రతిపక్షం మీద ఆగ్రహం వ్యక్తం చేసారు.

చంద్రబాబు అభ్యంతరం..వాకౌట్

చంద్రబాబు అభ్యంతరం..వాకౌట్

వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వటం పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రశ్నోత్తరాల సమయంలో వంశీకి మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. టీడీపీ సభ్యులు వంశీని మాట్లాడే అవకాశం ఇవ్వటాన్ని నిరసించారు. ఆ సమయంలో స్పీకర్ సైతం టీడీపీ సభ్యుల కామెంట్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది టీడీఎల్పీ సమావేశం కాదని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసంటూ సీరియస్ అయ్యారు. వంశీ మాట్లాడు హక్కు ఉందని..అవకాశం ఇవ్వాలని మంత్రి బుగ్గన కోరారు. దీంతో..స్పీకర్ మరోసారి వంశీకి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో..టీడీపీ సభ్యులు వాకౌట్ చేసారు.

English summary
Vallabhaneni Vamsi requested Speaker to treat him as special member not form tdp.tried to given clarity in house on his meeting with CM jagan. CBN and tdp leaders objected on this.Speaker serious on TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X