• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ , లోకేష్ టీడీపీకి గుదిబండ : వల్లభనేని వంశీ ధ్వజం

|

చంద్రబాబు నాయుడుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు . చంద్రబాబు నాయుడు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాంటివాడని తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీలో లోకేష్ గుదిబండ లాంటివాడని ఎద్దేవా చేశారు . ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ముఖ్యమైనదేనని పేర్కొన్న వల్లభనేని వంశీ, చంద్రబాబు పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆడలేక మద్దెల ఓడు అన్న సామెతలా ఉందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఏపీలోనూ టీడీపీ కృష్ణార్పణం: మాలోకం, జెండా పీకేసే ముందు ఎమోషన్స్ మామూలే: సాయిరెడ్డి సెటైర్లు

 చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయం

చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయం

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గన్నవరం బాలుర హైస్కూల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేశారు. తెలంగాణలో టిడిపిని టీఆర్ఎస్లో విలీనం చేశారని, ఇక ఏపీలో కూడా టిడిపి కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు టీడీపీని బీజేపీ లో విలీనం చేయడం ఖాయమని, తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు అందరూ ఆలోచించుకోవాలి అంటూ వల్లభనేని వంశీ పేర్కొన్నారు.

ఓటుకు నోటు విచారణకు వస్తుంది కాబట్టి, టిడిపి టీఆర్ఎస్లో విలీనం

ఓటుకు నోటు విచారణకు వస్తుంది కాబట్టి, టిడిపి టీఆర్ఎస్లో విలీనం

గత పంచాయతీ ఎన్నికల సమయంలో 40 శాతం ఓట్లు వచ్చాయని టపాసులు కాల్చిన తండ్రీకొడుకులు, ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఎందుకు పారిపోయారో చెప్పాలని ప్రశ్నించారు. గెలిచే దమ్ము లేక ఎన్నికలను బహిష్కరించారని వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు . తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు విచారణకు వస్తుంది కాబట్టి, టిడిపిని టీఆర్ఎస్లో విలీనం చేశాడని విమర్శించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి 2024 వరకు ఏపీకి రాజధానిగా హైదరాబాద్ లో ఉండే హక్కు ఉన్నప్పటికీ చంద్రబాబు పారిపోయి వచ్చాడు అంటూ దుయ్యబట్టారు.

ప్రధాని కావాలని రాష్ట్రంలోనే చతికిలబడ్డాడు

ప్రధాని కావాలని రాష్ట్రంలోనే చతికిలబడ్డాడు

2019 ఎన్నికల్లో ప్రధాని కావాలని పెద్ద ప్లాన్ వేసి రాష్ట్రంలోనే చతికిలబడ్డాడు అని, కనీసం సీఎం కూడా కాలేక పోయారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి టిడిపి రాజ్యసభ సభ్యులను బిజెపిలో సిగ్గులేకుండా విలీనం చేశాడని, చంద్రబాబు బతుకంతా అదే అంటూ వల్లభనేని వంశీ అసహనం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం అందించలేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్నారని వల్లభనేని వంశీ పేర్కొన్నారు.

చంద్రబాబుది అడుగడుగునా మోసం .. అదే జగన్ ది సంక్షేమం

చంద్రబాబుది అడుగడుగునా మోసం .. అదే జగన్ ది సంక్షేమం

సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా ఉన్నది వైసిపి ప్రభుత్వమని , అందుకే ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పట్టం కట్టి ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పది వేల కోట్ల రూపాయలను ఆడపడుచులకు ఇచ్చి మోసం చేయాలని చూశాడని, కానీ అదే 10 వేల కోట్ల రూపాయలతో సీఎం జగన్ ఆడపడుచులకు సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రయత్నిస్తున్నారని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఏపీలో కూడా టిడిపి పనైపోయిందని తేల్చి చెప్పారు.

English summary
Gannavaram MLA Vallabhaneni Vamsi made shocking comments on Chandrababu Naidu. Chandrababu Naidu has been severely criticized for being like an expired tablet. Vamsi said that Lokesh was like heavy burden to the Telugu Desam Party. Vallabhaneni Vamsi, who said that every election is important in a democracy, expressed his impatience that Chandrababu Parishad's elections boycott .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X