• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వల్లభనేని వంశీ వర్సెస్ దుట్టా రామచంద్రారావు.. సీఎంవోకు చేరిన పంచాయితీ; జగన్ తేల్చేస్తారా?

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలుగుదేశం పార్టీతో వల్లభనేని వంశీ విభేదించిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీని వదిలి జగన్ జపం చేస్తూ వైసీపీ గూటికి చేరినా వల్లభనేని వంశీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి వ్యతిరేకత చోటు చేసుకుంటూనే ఉంది.

వల్లభనేని వంశీ వర్సెస్ దుట్టా రామచంద్రరావు

వల్లభనేని వంశీ వర్సెస్ దుట్టా రామచంద్రరావు


గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావు కు మధ్య చాలా కాలం పాటు విభేదాలు కొనసాగాయి. రెండు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకొని స్థానికంగా రచ్చ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మరోవైపు వల్లభనేని వంశీకి వైసీపీ నేత దుట్టా రామచంద్ర రావుకు మధ్య గత కొంత కాలంగా గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి. ఇక తాజాగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వారి మధ్య విబేధాలు బట్టబయలయ్యాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ వ్యతిరేక వర్గమంతా వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇస్తే తామంతా కలిసి ఓడించి తీరుతామని పార్టీలో అగ్రనేత విజయసాయిరెడ్డికి లేఖలు కూడా రాశారు. వల్లభనేని వంశీ కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని లేఖల ద్వారా స్పష్టం చేశారు.

సీఎంవో కు చేరిన వల్లభనేని దుట్టాల వర్గ పోరు.. నేడు తాడేపల్లికి ఇరువురు నేతలు

సీఎంవో కు చేరిన వల్లభనేని దుట్టాల వర్గ పోరు.. నేడు తాడేపల్లికి ఇరువురు నేతలు

గన్నవరం నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు గానే మారాయి. తాజాగా వల్లభనేని వంశీకి దుట్టా రామచంద్ర రావుకు మధ్య చోటు చేసుకున్న గ్రూప్ తగాదాల పంచాయితీ సీఎంవో వరకు వెళ్ళింది. దీంతో వారిద్దరికీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. మొదట వీరి పంచాయితీని పరిష్కరించడం కోసం బుధవారం రావాలని చెప్పినప్పటికీ, ఆ తర్వాత గురువారం సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి రావాలని సీఎంవో సూచించింది.

తాడేపల్లి సాక్షిగా నేతల పంచాయితీ పరిష్కారం అవుతుందా?

తాడేపల్లి సాక్షిగా నేతల పంచాయితీ పరిష్కారం అవుతుందా?

ఇక ఈ ఇద్దరి వ్యవహారాన్ని త్వరగా తేల్చేయాలని సీఎం జగన్ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం వీరిద్దరి పంచాయితీ సీఎం ముందుకు రానుంది. తాడేపల్లి సాక్షిగా సీఎం జగన్ వీరి పంచాయతీ పై ఏం చేస్తారన్నది ప్రస్తుతం నియోజకవర్గంలో జోరుగా జరుగుతున్న చర్చ. ఒక్క గన్నవరం నియోజకవర్గం లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వల్లభనేని వంశీ వ్యవహారం ఏమవుతుందో అన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.

వల్లభనేని వంశీపై వైసీపీలో తీవ్ర వ్యతిరేకత... వంశీ చెప్తుందిదే

వల్లభనేని వంశీపై వైసీపీలో తీవ్ర వ్యతిరేకత... వంశీ చెప్తుందిదే

ఇక వల్లభనేని వంశీ తన సొంత వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను, నేతలను పట్టించుకోవడం లేదు అన్నది ప్రధానంగా వైసిపి వర్గం నుండి వస్తున్న ఆరోపణ. ఈ క్రమంలోనే గన్నవరం వైసిపి ఇన్చార్జిని నియమించాలని వైసిపి కార్యకర్తలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వల్లభనేని వంశీ ని పక్కన పెట్టి నిజమైన వైసిపి నాయకులకు ఇన్చార్జిగా బాధ్యతలు ఇవ్వాలని వైసిపి కార్యకర్తలు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సాధారణంగా నియోజకవర్గ ఇన్చార్జికే, టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ అవకాశం తనకు ఇవ్వాలని వల్లభనేని వంశీ కోరుతున్నారు.

జగన్ గన్నవరం పంచాయితీ ఎలా పరిష్కరిస్తారో? అందరిలోనూ ఆసక్తి

జగన్ గన్నవరం పంచాయితీ ఎలా పరిష్కరిస్తారో? అందరిలోనూ ఆసక్తి

ఇప్పటికే వైసీపీ ముఖ్యనేతలు గన్నవరం పంచాయితీ పరిష్కరించటానికి అనేక ప్రయత్నాలు చేశారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఉన్న వీరి పంచాయితీ పరిష్కరించలేక చేతులెత్తేశారు. ఇక ఇప్పుడు వీరి పంచాయితీ సీఎంవో కు చేరింది. ఇక పాత, కొత్త నేతల డిమాండ్లతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వీరిద్దరి వివాదంలో ఏం చేయబోతున్నారు అన్నది ఈరోజు సాయంత్రం తేలుతుంది.

English summary
Vallabhaneni Vamsi vs Dutta Ramachandra Rao internal war will continue in Gannavaram constituency. CMO called to them to come. Will Jagan settle their dispute today evening? The debate continues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X