వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టుకు వల్లభనేని వంశీ: ఆయన దుష్ప్రచారం చేస్తున్నారు: తీర్పు రిజర్వ్..!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో కొద్ది రోజుల క్రితం హాట్ టాపిక్ గా నిలిచిన వల్లభేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. తన పైనా..తన కుటుంబ పైన దుష్ప్రచారం చేస్తున్నారని..వారి పైన కేసు నమోదుకు ఆదేశించండి కోర్డును అభ్యర్ధించారు. దీని పైన విచారణ జరిగింది. వాదనలు ముగియటంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసారు. తన పైన సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయటం లేదంటూ వంశీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు.

బైరెడ్డి సిద్దార్ద రెడ్డి

బైరెడ్డి సిద్దార్ద రెడ్డి

వారిపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. తనపైన బైరెడ్డి సిద్దార్ద రెడ్డి జరుపుతున్న దుష్ప్రచారానికి సంబంధించి గన్నవరం సైబర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని..ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని పేర్కొంటూ వంశీ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ సైతం పూర్తయింది. అయితే, తుది ఆదేశాలు మాత్రం రిజర్వ్ చేసారు.

వంశీ మాత్రం తన నిర్ణయం

వంశీ మాత్రం తన నిర్ణయం

వంశీ గత నెల 25న ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తరువత రెండు రోజులకు టీడీపీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు వాట్సాప సందేశం ద్వారా తెలియచేసారు. దీనికి చంద్రబాబు సైతం సమాధానం ఇచ్చారు. వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని..పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, వంశీ మాత్రం తన నిర్ణయం వెనక్కు తీసుకుంటున్నట్లుగా ఎక్కడా చెప్పలేదు. అదే సమయంలో అడుగు ముందుకు కూడా వేయలేదు. కొద్ది రోజులుగా టీడీపీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. వంశీతో మంతనాల కోసం చంద్రబాబు ఇద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించినా..వారు వంశీ పార్టీ వీడే అవకాశమే కనిపిస్తోందని పరోక్షంగా స్పష్టం చేసారు.

అనుచరులు మాత్రం

అనుచరులు మాత్రం

వంశీ మాత్రం అటు టీడీపీకి..ఇటు వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ..పరిస్థితులు గమనిస్తున్నారు. అయితే, ఆయన అనుచరులు మాత్రం వంశీ పార్టీ మారటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఇటు వైపు వైసీపీ ముఖ్యులు మాత్రం జగన్ ను కలవటం ద్వారానే ఆయన పార్టీ మారినట్లేనని..అయితే, అధికారికంగా ఎప్పుడు చేరాలనేది వంశీ నిర్ణయమని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే వంశీ వైసీపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

English summary
Vallabhneni Vamsi filed petition in High court to order police on file case on Byreddy Sidhartha Reddy for abusing postings in social media against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X