వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కు అవగాహన లేదు, అది ఆయన బాధ్యత: వంగలపూడి అనిత కౌంటర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇటీవలి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్పందించారు.

పవన్ కళ్యాణ్‌కు విమర్శించే హక్కు ఉందని చెబుతూనే ఆమె చురకలు అంటించారు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. సమస్యలపై జనసేనానికి ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్‌కు అవగాహన లేదు

పవన్ కళ్యాణ్‌కు అవగాహన లేదు

ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్‌కు ఏమాత్రం అవగాహన లేదని, అలాంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందని వంగలపూడి అనిత అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్వేచ్ఛ పవన్‌కు ఉందని చెప్పారు.

నాయకులను ప్రజలు తేలుస్తారు

నాయకులను ప్రజలు తేలుస్తారు

2019 ఎన్నికల తర్వాత ఎవరూ ప్రజా నాయకులు అవుతారనే విషయాన్ని ప్రజలే తేలుస్తారని వంగలపూడి అనిత చెప్పారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పవవ్ కళ్యాణ్ ప్రస్తావస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు.

పవన్ అడిగితే పరిష్కరించారు, అలా అనడం సరికాదు

పవన్ అడిగితే పరిష్కరించారు, అలా అనడం సరికాదు

ప్రస్తుతం విపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతలను పూర్తిగా మరిచిపోయిందని అనిత అన్నారు. జగన్ తీరు వల్ల త్వరలోనే ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. వైసీపీ రోల్ మరిచిపోయిందని, జగన్ గోల్ సీఎం పదవే అన్నారు. ఉద్ధానం వంటి సమస్యలపై పవన్ ప్రశ్నించగానే చంద్రబాబు పరిష్కరిస్తున్నారని, అలాంటప్పుడు సమస్యలు పరిష్కరించడం లేదని జగన్, వైసీపీ ఎలా చెబుతుందని అడిగారు.

రాజకీయ నాయకుడిగా ప్రశ్నించడం బాధ్యత

రాజకీయ నాయకుడిగా ప్రశ్నించడం బాధ్యత


ప్రభుత్వంపై ఎవరు ఎన్ని మాట్లాడినా అంతిమ నిర్ణయం ప్రజలదే అన్నారు. తనకున్న ప్రజాస్వామిక హక్కును వినియోగించుకొని పవన్ అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారని అన్నారు. పవన్ పర్యటన కాన్సెప్ట్ మంచిదేనని చెప్పారు. రాజకీయ నాయకుడిగా ప్రశ్నించడం ఆయన సామాజిక బాధ్యత అన్నారు.

English summary
Telugu Desam Party MLA Vangalapudi Anitha counter to Jana Sena chief Pawan Kalyan and YSRCP chieef YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X