వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమర్శల ఎఫెక్ట్: టీటీడీ బోర్డు నుంచి వంగలపూడి అనిత తొలగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి విశాఖపట్నం పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను తొలగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె క్రైస్తవురాలు అనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.

అందుకు ఆమె చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోను హల్‌చల్ సృష్టించింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అనితను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Vangalapudi Anitha removed from TTD

కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చోటు తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా ఇటీవల చోటు దక్కించుకున్నారు. విమర్శలు రావడంతో ఆమె అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

టీటీడీ పాలక వర్గం సభ్యురాలిగా తన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆమెను తొలగించారు.

దిగొచ్చిన టీడీపీ: టీటీడీ పదవి నాకొద్దు.. బాబుకు అనిత లేఖ, ఆమే లేఖ రాయడం వెనుక దిగొచ్చిన టీడీపీ: టీటీడీ పదవి నాకొద్దు.. బాబుకు అనిత లేఖ, ఆమే లేఖ రాయడం వెనుక

తాను క్రైస్తవురాలిని అని, తన హ్యాండ్ బ్యాగ్‌లో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని అనిత ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు ప్రభుత్వం టీటీడీలో క్రైస్తవులకు చోటు కల్పిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

English summary
Visakhapatnam Payakaraopet MLA Vangalapudi Anitha removed from Tirumala Tirupati Devastanam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X