అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉండవల్లీ! అప్పుడు మీరు ఏమైపోయారు: వంగలపూడి అనిత కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పై వంగలపూడి అనిత ఫైర్

అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పైన టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంగళవారం నిప్పులు చెరిగారు. మద్యం అమ్మకాల విషయంలో నవ్యాంధ్ర ప్రభుత్వంపై ఆయన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలను నియంత్రించేందుకు చేస్తున్న కృషిని గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. మద్యం ఆదాయాన్ని రూ.3వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్లకు పెంచారన్నారు.

అమరావతి బాండ్లపై వారి పేర్లు చెప్పు, స్విస్ జైల్లో చంద్రబాబు సలహాదారు: ఉండవల్లిఅమరావతి బాండ్లపై వారి పేర్లు చెప్పు, స్విస్ జైల్లో చంద్రబాబు సలహాదారు: ఉండవల్లి

చాలా వాటిని ధ్వంసం చేశాం

చాలా వాటిని ధ్వంసం చేశాం

వైయస్ రాజశేఖర రెడ్డి అండతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా లక్షలకొద్ది బెల్ట్ షాపులు వెళిశాయని వంగలపూడి అనిత అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 2014లో రూ.4,352 కోట్లున్న మద్యం ఆదాయం 2017 నాటికి రూ.4,644 కోట్లకు మాత్రమే పెరిగిందన్నారు. రాష్ట్రంలో అనేక బెల్ట్ షాపుల్ని ధ్వంసం చేసి, కేసులు పెట్టారన్నారు.

అప్పుడు ఏమయ్యారు మీరు?

అప్పుడు ఏమయ్యారు మీరు?

మద్యం నియంత్రణకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వంగలపూడి అనిత చెప్పారు. వైయస్ హయాంలో మద్యం ఏరులై పారుతున్నప్పుడు ఉండవల్లి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు లిక్కర్‌ మాఫియాతో కుమ్మక్కై కోట్ల రూపాయలు గడించినప్పుడు ఆయన ఏమయ్యారని నిలదీశారు.

 అరాచకత్వమే వైసీపీ విధానం

అరాచకత్వమే వైసీపీ విధానం

అరాచకత్వమే వైసీపీ విధానమని మైనార్టీ ఆర్థిక సంస్థ ఛైర్మన్‌ ఎండీ హిదాయత్‌ ధ్వజమెత్తారు. గతంలో తుని కాపు సభ సందర్భంగా కూడా ఆ పార్రీట కొందరిని పంపించి అల్లర్లు సృష్టించిందని ఆరోపించారు. ఇటీవల గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా సభనూ భగ్నం చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమాజం టీడీపీ వెంట ఉందని చెప్పారు.

చంద్రబాబు రాజీలేని పోరాటం

చంద్రబాబు రాజీలేని పోరాటం

గుంటూరు నారా హమారా, టీడీపీ హమారా సభతో వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముస్లీంలు అందరూ అండగా ఉండాలన్నారు.

English summary
Telugudesam party Vangalapudi Anitha takes on Former MP Undavalli Arun Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X