అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకటే రాష్ట్రం..ఒకటే రాజధాని: జగన్ కు సమయం లేదా: రైతులకు మద్దతుగా వంగవీటి రాధా..!

|
Google Oneindia TeluguNews

అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులకు వంగవీటి రాధా సంఘీభావం ప్రకటించారు. తుళ్లూరులో రైతులు చేస్తున్న ఆందోళనల్లో పాల్గొన్నారు. రైతులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒకటే రాష్ట్రం..ఒకటే రాజధాని అంటూ నినదించారు. మూడు రాజధానులన్నా..30 రాజధానులన్నా ఇదే తన తమ నినాదమని స్పష్టం చేసారు. రైతుల నాయకత్వంలో తామంతా నడుస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో రైతుల త్యాగాలను రాధా ప్రశంసించారు. రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తామని వెల్లడించారు. వారి పోరాటానికి బాసటగా ఉంటామని హామీ ఇచ్చారు.

సుదీర్ఘ విరామం తరువాత..
వంగవీటి 2019 ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసారు. ఎన్నికల ఫలితాల తరువాత పూర్తిగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అమరావతికి మద్దతుగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తరువాత.. రాధా టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటుగా లోకేశ్ ను కలిసారు. వారి సూచనల మేరకు రాజధాని రైతుల కు మద్దతుగా ఈ రోజు తుళ్లూరులో జరుగుతున్న రైతుల దీక్షలో పాల్గొన్నారు. అమరావతికి మద్దతు ప్రకటించారు. అమరావతి నుండి రాజధాని తరలించటానికి వీళ్లేదంటూ పోరాటం చేస్తున్న వారిని అభినందించా రు. వారికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన రాధా..రైతుల నాయకత్వంలో పని చేస్తానని ప్రకటించారు.

 Vangaveeti Radha announced his support for Amaravati agitation

అమరావతే రాజధాని..
రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించిన.. తెదేపా నేత వంగవీటి రాధ కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులకు కులాలు అంటగట్టడం సరికాదని... రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శమని చెప్పుకొచ్చారు. పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడటానికి ముఖ్యమంత్రి జగన్‌కు సమయం ఉంది కానీ, రాజధాని రైతులతో మాట్లాడేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఏ జిల్లాలో ప్రమాణస్వీకారం చేశారో ఆ జిల్లాకే సమస్యలు సృష్టించారని విమర్శించారు. రైతులకు మద్దతుగా ఉంటామని... రైతుల నాయకత్వంలో తామంతా నడుస్తామని స్నష్టం చేసారు. మూడు రాజధానులు అన్నా.. 30రాజధానులు అన్నా.. మనకు తెలిసిన ఒకే నినాదం ఒక్కటే...ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని.. అదే అమరావతి అనే నినాదంతో కలిసికట్టుగా ముందుకెళ్దామంటూ వంగవీటి రాధా పిలుపునిచ్చారు.

English summary
TDP leader Vangaveeti Radha supported Amaravati Farmers. Rahda says one state ..one capital is the slogan for all people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X