India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నాని అడ్డాలో వంగవీటి రాధా - కాపు నేతలతో భేటీ : రాజకీయంగా ఫిక్స్ అయ్యారా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మంత్రి కొడాలి నాని కంచుకోటలో వంగవీటి రాధా. కాపు నేతలతో భేటీ. ఈ మధ్య కాలంలో తరచూ గుడివాడ పర్యటనలో కనిపిస్తున్న రాధా. కానీ, రాధాను కలుస్తున్న కాపు నేతల్లో ఎక్కవ మంది వైసీపీ మద్దతు దారులే. దీంతో..అసలు ఏం జరుగుతోంది. గుడివాడ పైన రాధా ఫోకస్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది. ఏపీలో కాపు నేతల్లో ముందుగా వినిపించే పేరు వంగవీటి రాధా. 2019 ఎన్నికలకు ముందే ఆయన వైసీపీ వీడి టీడీపీలో చేరారు. ఆయన మిత్రులు కొడాలి నాని మంత్రిగా ఉన్నారు.

గుడివాడలో వంగవీటి రాధా

గుడివాడలో వంగవీటి రాధా

మరో మిత్రుడు వంశీ టీడీపీ నుంచి గెలిచినా వైసీపీ మద్దతుదారుడిగా కొనసాగుతున్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం వారిద్దరి సమక్షంలో తనను పొట్టున పెట్టుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని..రెక్కీ జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీని పైన పోలీసు విచారణ.. ప్రభుత్వం గన్ మెన్ల ఏర్పాటు తో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇక, కొడాలి నాని - వంశీ - రాధా అప్పుడప్పుడూ సమావేశం అవుతూనే ఉంటారు. గతంలోనూ రాధా పలుమార్లు గుడివాడ కు వెళ్లటం.. అక్కడ మంత్రి కొడాలి నానితోనూ సమావేశం కావటం చోటు చేసుకుంది. ఇక..ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కాపు నేతలు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కాపు నేతల సమావేశాల్లోనూ..

కాపు నేతల సమావేశాల్లోనూ..

తాజాగా విశాఖలో జరిగిన కాపు నేతల సమావేశంలో మాజీ డీజీపీ సాంబశివరావు ఛైర్మన్ గా సొసైటీ ఫర్ బెటర్ ఏపీ సంస్థను ఏర్పాటు చేసారు. ఇక, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్లు వంగవీటి రంగా విగ్రహాల ఆవిష్కరణకు ఆహ్వానించినా రాధా హజరవుతూ వస్తున్నారు. అయితే, గుడివాడలో రాధా పర్యటన సమయంలో ఎక్కువగా వైసీపీకి చెందిన కాపు నేతలు రాధా భేటీలో పాల్గొంటున్నారు. తాజాగా.. కృష్ణాజిల్లా గుడివాడలోని ఆర్టీసీ కాలనీలో.. నియోజకవర్గ పరిధిలోని కాపు సంఘం ముఖ్య నేతలతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నేతలతో పాటు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

కొడాలి నాని నియోజకవర్గంలో కొత్త సమీకరణాలు

కొడాలి నాని నియోజకవర్గంలో కొత్త సమీకరణాలు

వంగవీటి రాధాకృష్ణ గుడివాడలో తరచూ సమావేశం నిర్వహించటం.. వైకాపా నేతలు ఎక్కువగా హాజరవటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై రాధాను ప్రశ్నించగా.. మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉందంటూ వెళ్లిపోయారు. రాధా తాను మాట్లాడేందుకు చాలా సమయం ఉందని చెప్పటమే ఇప్పుడు అసలు రకరకాల చర్చలకు దారి తీస్తోంది. రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు మంత్రి కొడాలి నాని ప్రయత్నాలు చేసారనే ప్రచారమూ సాగింి. కానీ, దానిని కొడాలి నాని ఖండించారు. రాధా కు మాత్రం అనుకూలంగానే మాట్లాడారు. అయితే, గుడివాడలో రాధాకు మంత్రి నాని సన్నిహితులే స్వాగతం పలకటం.. ఆయనతో ఉండటం ద్వారా.. అసలు రాధా లక్ష్యం ఏంటనేది ఇప్పుడు నియోజకవర్గంలో రాజకీయంగా చర్చకు కారణమైంది.

మంత్రి ఇలాకాలో ఏం జరుగుతోంది

మంత్రి ఇలాకాలో ఏం జరుగుతోంది

టీడీపీ అధినాయకత్వం పైన మంత్రి కొడాలి నాని తరచూ విరుచుకు పడటం.. టీడీపీ అధినాయకత్వం సైతం మంత్రి కొడాలి నానిని రాజకీయంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితుల్లో వంగవీటి రాధా గుడివాడలో కాపు నేతలతో భేటీ కావటం మరింత ఆసక్తి కరంగా మారింది. దీంతో.. ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న గుడివాడ రాజకీయాల్లో ఇప్పుడు వంగవీటి రాధా సమావేశాలు.. అడుగులు రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయ సమీకరణాలకు కారణమవుతాయో చూడాలి.


English summary
Vangaveeti Radha Meeting with Kapu leaders in Gidvada now became political debate in AP Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X