వంగవీటి రంగా అభిమానులు తల్చుకుంటే ప్రభుత్వాన్ని...వంగవీటి రాధా సంచలనం
వంగవీటి రాధా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా అభిమానులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని, ప్రభుత్వాన్ని కూల్చాలన్నా, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా అది రంగా అభిమానులతో సాధ్యమవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా
శ్రీనగర్ కాలనీలో వంగవీటి రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో రంగా, రాధా అభిమానులు వంగవీటి రాధాకు, భారీ ర్యాలీతో బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. తన తండ్రి వంగవీటి రంగాను ప్రజలు కులమతాలకతీతంగా గుండెల్లో పెట్టుకున్నారని ఈ సందర్భంగా రాధా వ్యాఖ్యానించారు. శ్రీనగర్లో కాంస్య విగ్రహ ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన వంగవీటి రాధా, రాష్ట్రం నలుమూలలా వంగవీటి రంగా పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారని వెల్లడించారు.

జిల్లాకు ఆయన పేరు పెడితే సంతోషిస్తా
వంగవీటి రంగా అంటే పోరాటానికి దిక్సూచి అని, ఆయన పేదల పాలిట పెన్నిధి అని తెలిపారు వంగవీటి రాధాకృష్ణ. రంగా కొడుకుగా తాను ఎవరినీ అభ్యర్థించనని, జిల్లాకు రంగా పేరు పెడితే సంతోషిస్తానని పేర్కొన్నారు. వంగవీటి రంగా ఒక జిల్లాకే పరిమితం కాదన్న వంగవీటి రాధా రాష్ట్రం మొత్తం ఆయనను ఆరాధిస్తుందని పేర్కొన్నారు. రంగా చరిత్ర గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదు అని ఆయన వెల్లడించారు. రంగా అభిమానులు తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చేస్తారు నిలబెడతారు అంటూ వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రంగా పేరు చెప్పుకుని ఎంతో మంది పదవులు అనుభవించారు
రంగా
పేరు
చెప్పుకుని
ఎంతోమంది
రాజకీయ
పదవులు
అనుభవించారని,
రంగా
శిష్యులు,
అభిమానులు
ప్రజాప్రతినిధులుగా
ఉన్నారని
వంగవీటి
రాధా
వ్యాఖ్యానించారు.
తన
తండ్రి
రంగా
ఆశయాలు
కొనసాగించడమే
తన
ధ్యేయమని
వంగవీటి
రాధా
స్పష్టం
చేశారు.
తనకు
జీవితాంతం
అండగా
ఉండేది
రంగా
అభిమానులేనని
ఆయన
పేర్కొన్నారు.
ఏ
పదవి
ఏ
హోదా
ఇవ్వని
గౌరవం
తనకు
వంగవీటి
రంగా
కొడుకుగా
దొరికిందని
ఆయన
వెల్లడించారు.
పదవులు
ఐదేళ్లు
ఉంటాయి
పోతాయి
కానీ
రంగా
కొడుకుగా
ప్రజలు
చూపించే
అభిమానం
మాత్రం
అనంతమని
వంగవీటి
రాధాకృష్ణ
ఉద్వేగానికి
గురయ్యారు.

రంగా అభిమానులు తలచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు
ఈ
జన్మకు
రంగా
కొడుకును
అన్న
ఆదరణ
తనకు
సంతృప్తిని
ఇస్తుందని
ఆయన
పేర్కొన్నారు.
అంతకుముందు
తనను
భూమ్మీద
లేకుండా
చేయడానికి
కొంతమంది
ప్రయత్నిస్తున్నారని
వంగవీటి
రాధ
సంచలన
వ్యాఖ్యలు
చేసిన
విషయం
తెలిసిందే.
ఇక
తాజాగా
రంగా
అభిమానులు
తలుచుకుంటే
ప్రభుత్వాన్ని
కూల్చేస్తారు,
నిలబెడతారు
అంటూ
చేసిన
వ్యాఖ్యలపై
రాష్ట్ర
వ్యాప్తంగా
చర్చ
జరుగుతోంది.