విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ జనం పిచ్చోళ్లుకారు, వాడి కర్మ వాడే అనుభవిస్తాడు: వంగవీటి రాధా హెచ్చరిక

విజయవాడ జనం రెచ్చగొడితే రెచ్చిపోయేంత పిచ్చొళ్లు కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ సోమవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ జనం రెచ్చగొడితే రెచ్చిపోయేంత పిచ్చొళ్లు కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ సోమవారం అన్నారు.

చదవండి: చూస్తూ ఊరుకోం, జగన్‌కు చాలాసార్లు చెప్పా: గౌతంరెడ్డిపై వంగవీటి రాధా సంచలనం, వర్మపై..

వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతమ్ రెడ్డి వాడి కర్మ వాడు అనుభవిస్తాడని ధ్వజమెత్తారు. వైసిపి నాయకత్వం ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకోవద్దన్నారు.

చదవండి: అసలేమైంది: జగన్ ఆరా, వంగవీటిపై గౌతంరెడ్డి వ్యాఖ్యల వెనుక మరో కోణం

గౌతమ్ రెడ్డిని ఏ పార్టీ తీసుకోదు

గౌతమ్ రెడ్డిని ఏ పార్టీ తీసుకోదు

గౌతం రెడ్డిలాంటి వారు ఏ పార్టీలో ఉండేందుకు అర్హులు కాదని వంగవీటి రాధా అన్నారు. ఆయనను ఏ పార్టీ తీసుకోదని తాను అనుకుంటున్నానని చెప్పారు. రంగా గురించి వ్యక్తిగతంగా మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు.

మల్లాది విష్ణుతో విభేదాల్లేవు

మల్లాది విష్ణుతో విభేదాల్లేవు

మల్లాది విష్ణు, తాను ఒకే నియోజకవర్గంలో ఉన్నప్పటికి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని వంగవీటి రాధా చెప్పారు. గౌతమ్ రెడ్డిపై తమ పార్టీ సస్పెన్షన్ ఎత్తివేస్తుందని తాను భావించడం లేదని చెప్పారు.

గౌతమ్ రెడ్డికి ఘాటు వార్నింగ్

గౌతమ్ రెడ్డికి ఘాటు వార్నింగ్

గౌతమ్ రెడ్డికి ఘాటైన వార్నింగ్ ఇచ్చారు వంగవీటి రంగా. ఈ వివాదంపై గౌతం రెడ్డి వివరణ ఇచ్చినా వైసిపి నాయకత్వం అంగీకరించకూడదని తేల్చి చెప్పారు. గౌతం రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని రాధా డిమాండ్ చేశారు. రంగా గురించి వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తే వాడి కర్మ వాడే అనుభవిస్తాడని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు.

లా అండ్ ఆర్డర్ అదుపు తప్పదు

లా అండ్ ఆర్డర్ అదుపు తప్పదు

తాజా వివాదంతో విజయవాడంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై పై స్పందించిన రాధాకృష్ణ.. తునిలో భారీ ఘర్షణలు జరిగితేనే విజవయాడ చలించలేదని, విజయవాడ జనం రెచ్చగొడితే రెచ్చిపోయేంత పిచ్చోళ్లు కాదన్నారు.

English summary
Tension prevailed in Vijayawada following YSRCP MLA P Goutham Reddy’s comments against the late Vangaveeti Mohana Ranga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X