విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మల్లాది విష్ణుకు సంకేతాలు, అలిగివెళ్లిన వంగవీటి రాధా: అధిష్టానం హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే టిక్కెట్ చిచ్చు రాజుకుంటోంది. ఆయా స్థానాల నుంచి ఇప్పటికే పలువురు రేసులో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ పైన వంగవీటి రాధాకృష్ణతో పాటు మల్లాది విష్ణులు ఆశలు పెట్టుకున్నారు.

తెలంగాణ విచ్ఛిన్నానికి ఆ సంపాదన: బాబుపై సుమన్, ఎన్టీఆర్ ఫ్యామిలీకి సూచనతెలంగాణ విచ్ఛిన్నానికి ఆ సంపాదన: బాబుపై సుమన్, ఎన్టీఆర్ ఫ్యామిలీకి సూచన

బందర్ నుంచి పోటీ చేయాలని వంగవీటికి అధిష్టానం

బందర్ నుంచి పోటీ చేయాలని వంగవీటికి అధిష్టానం

విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ వద్దని, బందర్ పార్లమెంటు నుంచి పోటీ చేయాలని వంగవీటి రాధాకృష్ణకు పార్టీ అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తోంది. దానికి అతను ససేమీరా అన్నారని తెలుస్తోంది. తాను సెంట్రల్ నుంచి బరిలోకి దిగుతానని అధిష్టానానికి స్పష్టం చేశారు.

అలిగి వెళ్లిపోయిన వంగవీటి రాధా

అలిగి వెళ్లిపోయిన వంగవీటి రాధా

ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పార్టీ కార్యక్రమం గడపగడపకూ వైసీపీని చేపట్టాలని మల్లాది విష్ణుకు వైసీపీ వాణిజ్య సమావేశంలో సంకేతాలు ఇచ్చారు. దీనిపై వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు వాణిజ్య సమావేశం నుంచి అతను అలిగి వెళ్లిపోయారని తెలుస్తోంది.

అందరికీ హెచ్చరికలు

అందరికీ హెచ్చరికలు

విజయవాడ సెంట్రల్‌తో పాటు అవనిగడ్డ, విజయవాడ వెస్ట్‌లోను పార్టీలోని అంతర్గత విభేదాలపై అధిష్టానం దృష్టి సారించింది. విబేధాలపై సీరియస్‌గా ఉంది. వర్గాలుగా కాకుండా అందరు కలిసి పని చేయాలని పార్టీ జిల్లా నేతలకు హితవు పలికింది.

ఏపీలో ఎన్నికల వేడి

ఏపీలో ఎన్నికల వేడి

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. ఏపీలోను అప్పుడే ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో ఉండనున్నాయి. కానీ జనసేన రంగంలోకి దిగడం, వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతుండటంతో ఏపీలోను ఎన్నికల వేడి కనిపిస్తోంది.

English summary
YSR Congress Party leader Vangaveeti Radha unhappy with YSRCP high command orders!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X