విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చూస్తూ ఊరుకోం, జగన్‌కు చాలాసార్లు చెప్పా: గౌతంరెడ్డిపై వంగవీటి రాధా సంచలనం, వర్మపై..

వంగవీటి రంగా, రాధాలపై గౌతమ్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో తనకు అర్థం కావడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వంగవీటి రంగా, రాధాలపై గౌతమ్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో తనకు అర్థం కావడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఆయన సాయంత్రం ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడారు.

చదవండి: అసలేమైంది: జగన్ ఆరా, వంగవీటిపై గౌతంరెడ్డి వ్యాఖ్యల వెనుక మరో కోణం

ఎందుకు అన్నారో

ఎందుకు అన్నారో

వేరే పార్టీలోకి పెళ్దామనో, రాజకీయంగా భూస్థాపితం అయిపోదామనో గౌతం రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని వంగవీటి రాదా ఎద్దేవా చేశారు. వంగవీటి రాధ, రంగాలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.

కోట్లు దోచుకున్నాడు

కోట్లు దోచుకున్నాడు

గతంలో సిపిఐలో ఉన్న గౌతం రెడ్డి ఆ పార్టీని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని వంగవీటి రాధా తీవ్ర ఆరోపణలు చేశారు. ల్యాండ్ మాఫియాతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్నారు.

అతనిపై రౌడీ షీట్

అతనిపై రౌడీ షీట్

రెండు హత్య కేసుల్లో గౌతమ్ రెడ్డి నిందితుడు అని వంగవీటి రాధా ఆరోపించారు. గౌతం రెడ్డిపై సుమారు పన్నెండు నుంచి పదమూడేళ్ల పాటు రౌడీ షీట్ ఉందని చెప్పారు.

వైసిపి అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు, ఊరుకోం

వైసిపి అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు, ఊరుకోం

గౌతంరెడ్డి తీరుపై పార్టీ అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాధ, రంగాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని, ఈ వ్యాఖ్యలు గౌతంరెడ్డి కావాలనే చేశారా లేక ఎవరైనా ఈవిధంగా మాట్లాడించారా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు.

రంగా అభిమానులు బాధపడొద్దు

రంగా అభిమానులు బాధపడొద్దు

ఎవరో ఏమో అన్నారని వంగవీటి రంగా అభిమానులు బాధపడవద్దన్నారు. ఓ వెధవ వ్యాఖ్యానించాడన్నారు. ఓ వెధవను పెంచి పోషించినందుకు తమ పార్టీ కూడా వెంటనే చర్యలు తీసుకుందని వంగవీటి రాధా చెప్పారు.

వర్మ సెటైర్లపై..

వర్మ సెటైర్లపై..

రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం గురించి మాట్లాడారు. 'అసలు, ఆ కామెంట్సే నేను చూడలేదు. ఎలా స్పందిస్తాను? ఏం మాట్లాడతాను?' అన్నారు. నిన్న జరిగిన సంఘటనలో సీన్ క్రియేట్ చేసింది తాము కాదని, పోలీసులేనని అన్నారు. తమతో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. పోలీసుల ప్రవర్తన కారణంగా తన తల్లి రత్నకుమారి కాలికి గాయమైందన్నారు.

English summary
YSR Congress Party leader Vangaveeti Radhakrishna on Monday make hot comments on Gautham Reddy, who suspended from YSRCP in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X