విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుజ్జగించినా జగన్‌కు వంగవీటి రాధా షాక్!: పార్టీకి రాజీనామా, జనసేనలో చేరుతారా?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చేందుకు సిద్ధమయ్యారా? రేపో మాపో పార్టీని వీడనున్నారా? పార్టీ అధినేత సూచనతో కీలక నేతలు బుజ్జగించినా ఫలించడం లేదా? వంగవీటి రాధా పార్టీని వీడేందుకే నిర్ణయించుకున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

<strong>సెంట్రల్ ముసలం, వైసీపీకి షాక్: జగన్‌పై ఆగ్రహం.. పార్టీకి వంగవీటి రాజీనామా!</strong>సెంట్రల్ ముసలం, వైసీపీకి షాక్: జగన్‌పై ఆగ్రహం.. పార్టీకి వంగవీటి రాజీనామా!

నేడో రేపో వైసీపీకి రాజీనామా?

నేడో రేపో వైసీపీకి రాజీనామా?

అసెంబ్లీ సీటు విషయంలో వంగవీటి రాధాకృష్ణ గత కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో పలువురు సీనియర్ నేతలు పలుమార్లు చర్చలు జరిపారు. తాజాగా, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. కానీ సీటు విషయంలో వంగవీటి రాధా నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది. తాను పట్టుబడుతున్న సీటు కావాల్సిందేనని చెబుతున్నారని తెలుస్తోంది. మరోవైపు, దానికి వైసీపీ కూడా అంగీకరించడం లేదు, ఈ నేపథ్యంలో ఆయన నేడో రేపో వైసీపీకి రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

విజయవాడ సెంట్రల్ పై వైసీపీలో రగడ

విజయవాడ సెంట్రల్ పై వైసీపీలో రగడ

వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటును ఆశిస్తున్నారు. అయితే ఆ సీటు కాకుండా విజయవాడ ఈస్ట్ లేదా మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తోంది. వంగవీటి రాధాకృష్ణకు టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ నాలుగైదు నెలల క్రితమే వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ రాజీనామా చేశారు. సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమైందని తెలుస్తోంది. 2014లో వైసీపీ నుంచి గౌతమ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.

జనసేనలో చేరుతారా?

జనసేనలో చేరుతారా?

వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో టిక్కెట్లు దక్కని అసంతృప్తుల కోసం జనసేన పార్టీ వేచి చూస్తోంది. దీంతో వంగవీటి జనసేనలో చేరవచ్చుననే చర్చ సాగుతోంది. వంగవీటి రాధా గతంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. దీంతో పవన్‌తో మంచి సంబంధాలు ఉంటాయి. ఈ కారణంగా కూడా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 విజయవాడ సెంట్రల్ లెఫ్ట్‌కు ఇస్తే

విజయవాడ సెంట్రల్ లెఫ్ట్‌కు ఇస్తే

అయితే, విజయవాడ సెంట్రల్ సీటును పొత్తులో భాగంగా జనసేన.. లెఫ్ట్ పార్టీకి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అదే జరిగితే వంగవీటి రాధా ఏ పార్టీలో చేరుతారనే చర్చ కూడా సాగుతోంది. ఇక్కడ లెఫ్ట్ పార్టీకి మంచి కేడర్ ఉంది. అలాగే, జనసేనకు ఫాలోయింగ్ ఉంది. పొత్తులో భాగంగా లెఫ్ట్‌కు ఇవ్వాలనే చర్చలు సాగుతున్నాయట. అయితే వంగవీటి రాధా వస్తే ఆ నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.

English summary
YSR Congress Party leader Vangaveeti Radhakrishna may resign to party to join Pawan Kalyan's Janasena? Vangaveeti Radhakrishna is unhappy with Vijayawada Central seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X