వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లఫూట్! వీపు పగిలిపోతది.. రంగా జోలికి రావద్దు: వంగవీటి రాధా సీరియస్ వార్నింగ్!

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన గౌతం రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమపై వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు గానీ వంగవీటి రాధా.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Vangaveeti Radhakrishna Made Firing Comments ఏ చరిత్ర లేని లఫూట్ గాడు రంగా గురించి మాట్లాడడమేంటి?

విజయవాడ: వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన గౌతం రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమపై వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు గానీ వంగవీటి రాధా, రంగాల జోలికి రావద్దని హెచ్చరించారు. వాడెంత? వాడి బతుకెంత? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దడ పుట్టించారు: తల్లిని చూసి ఏడ్చిన రాధా, బెజవాడలో హైటెన్షన్..దడ పుట్టించారు: తల్లిని చూసి ఏడ్చిన రాధా, బెజవాడలో హైటెన్షన్..

ఏ చరిత్ర లేని లఫూట్ గాడు రంగా గురించి మాట్లాడడమేంటి? అని ఫైర్ అయ్యారు. చనిపోయినవారి గురించి నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఎవడైనా సరే, ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే.. రంగా గారిపై అవాకులు చవాకులు పేలితే అన్ని పార్టీలో ఉన్న ఆయన అభిమానులు ఏకమవుతారని గుర్తుచేశారు.

వీపు పగిలిపోతది, అంతు తేలుస్తాం:

వీపు పగిలిపోతది, అంతు తేలుస్తాం:

తమను విమర్శించే స్థాయి వాడికి లేదని,వాడి బతుకేంటో, వాడి పరిస్థితేంటో అందరికీ తెలుసుని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వామపక్షాల అండతో గౌతం రెడ్డి కోట్లు సంపాదించాడని విమర్శించారు. వాడి భూకబ్జాలు, కేబుల్ కబ్జాలు, హత్య కేసుల గురించి అందరికీ తెలుసన్నారు. ఇలాంటి ఎధను ప్రోత్సహించినందుకు తమ పార్టీ బాధపడుతోందన్నారు. రంగా గారిని ఎవరైనా ఏమైనా అన్నాడా?.. వీపు పగిలిపోతదని, అంతు తేలుస్తామని అన్నారు.

నోటి దూలే:

నోటి దూలే:

గౌతం రెడ్డి నోటి దూల వల్లే ఇంత గొడవ జరిగిందని రాధా అన్నారు. మా భావనను వ్యక్తపరచాలనే పబ్లిక్ లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నామని, ఏదో చేద్దామనుకుంటే డైరెక్ట్ గా వాళ్లింటికే వెళ్లేవాళ్లమని తెలిపారు. ఎవడో ఏదో అన్నాడని రంగా అభిమానులు బాధపడవద్దన్నారు. అభిమానులు ఆగ్రహానికి గురైతే ఎంతటి వాడైనా బ్రష్టుపట్టిపోతాడని మండిపడ్డారు. మా సహనాన్ని పరీక్షించవద్దని, రంగాగారి అభిమానులు ఒక స్థాయి వరకు సహనంతో ఉంటారని హెచ్చరించారు.

కొట్టిపారేసిన రాధా:

కొట్టిపారేసిన రాధా:

2014ఎన్నికల్లో గౌతంరెడ్డి వెనుక రాధా ఉన్నారా? అన్న ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నను ఆయన కొట్టేశారు. కాగా, తన ఓటమికి వంగవీటి రాధా కారణమని గౌతం రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఒకే పార్టీ అయినప్పటికీ తనకు వ్యతిరేకంగా పనిచేసి ఓడిపోయేలా చేశారని ఆయన ఆరోపించారు. ఇకపోతే రంగాను అభిమానించేవారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని రాధా అన్నారు.

నీ స్థాయికి తగ్గట్లు ఉండు:

నీ స్థాయికి తగ్గట్లు ఉండు:

ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేసరికి వాడేదో పెద్ద లీడర్ అయిపోయాననుకుంటున్నాడని రాధా విమర్శించారు. కార్పోరేట్ స్థాయి వాడు అదే స్థాయిలో ఉండాలని, తమ స్థాయికి సరితూగడని అన్నారు. ఈసారి ప్రజలే వాడికి బుద్ది చెబుతారని తెలిపారు. పార్టీ తీసుకున్న చర్యలు బాగున్నప్పటికీ వాడికి మరింత కఠినమైన శిక్ష విధించాల్సింని రాధా అభిప్రాయపడటం గమనార్హం.

English summary
Vangaveeti Radhakrishna made firing comments on Gautam Reddy for the allegations on Ranga. He seriously warned him on Monday in Vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X