వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"రంగా ఇప్పటికీ హీరోనే, నువ్వేమైనా సత్య హరిశ్చంద్రుడివా?, 17మర్డర్ కేసులు"

గౌతంరెడ్డికి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, వాటిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారని అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: 'రాధా, రంగా పాములాంటోళ్లని, పాములను ప్రజలు చూస్తూ ఊరుకోరు, చంపుతారు' అంటూ వైసీపీ నేత గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యానాలు వంగవీటి వర్గంలో మంట పుట్టించాయి. రంగా అభిమానులు, ఆయన తనయుడు రాధా.. గౌతం రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ కు సిద్దమవగా.. అది కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది.

దడ పుట్టించారు: తల్లిని చూసి ఏడ్చిన రాధా, బెజవాడలో హైటెన్షన్..దడ పుట్టించారు: తల్లిని చూసి ఏడ్చిన రాధా, బెజవాడలో హైటెన్షన్..

తాజాగా వంగవీటి అనుచరులు గౌతం రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. . రంగా, రాధాలపై కామెంట్ చేసిన గౌతంరెడ్డి ఏమైనా సత్యహరిశ్చంద్రుడా? అని ప్రశ్నించారు. ఆయనపై 17 మర్డర్ కేసుల్లో ఆరోపణలున్నాయన్నారు. గౌతంరెడ్డికి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, వాటిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారని అన్నారు.

vangaveeti ranga and radha supporters counter attack on gautam reddy

ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాక ఎన్నికల సమయంలో ఆర్థికంగాను పార్టీ సహాయం అందించిందని గుర్తుచేశారు. కార్పోరేటర్ అయిన గౌతంరెడ్డి ఆయన స్థాయి మేరకే వ్యవహరించాలన్నారు. గౌతంరెడ్డికి రూ.300కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. సత్యనారాయణపురంలో బ్రాహ్మణుల భూములను ఆయన కబ్జా చేశారని ఆరోపించారు.

గౌతంరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం మంచి నిర్ణయమని రాధా అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. రంగా 'ఇప్పటికీ హీరోనే' అని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

English summary
Vangaveeti Ranga and Radha supporters made counter statements on Gautam Reddy for targeting them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X