• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వంగవీటి రాధా..! ఎందుకంత వ్యధ..? రాజకీయాలకు దూరమైనట్టేనా..?

|

అమరావతి/హైదరాబాద్ : వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో చిత్ర విచిత్ర మలుపులు తీసుకుంటూ, తప్పడగులు వేస్తున్న వంగవీటి రాంగా తనయుడు రాధా పరిస్థితి ఇంకా చౌరస్తాలో చంటిపిల్లాడి మాదిరిగానే తయారయ్యింది. కుటుంబ నేసథ్యం పూర్తి స్థాయిలో రాజకీయమైనప్పటికి సమకాలీన రాజకీయాలను అంచనా వేయడంలో రధా పూర్తిగా విఫలం చెందుతున్నట్టు తెలుస్తోంది.

ఏపార్టీలో ఉన్నా, పార్టీ మారినా, గెలిచామా..? లేదా..? అన్నదే లెక్క. కాని ఎన్నికల ముందు వైసీపి ప్రాభల్యాన్ని అంచనా వేసిన చాలా మంది రాజకీయ నేతలు జగన్ పంచన చేరారు.కాని పరిస్థితులను పసిగట్టలేని రాధా మాత్రం జగన్ దోస్తీని కాదని కష్టాలు కొని తెచ్చుకున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీలో చేరేందుకు సిద్దపడుతున్న రాధా, రాజకీయాల్లో సత్తా చాటాలనుకుంటే మరో ఐదేళ్లు వేచి చూడక తప్పని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ లోపు రాధా జనంలో ఉంటారా.. స్తబ్దుగా ఉంటారా అనే అంశం ఆసక్తి రేపుతోంది.

 రాజకీయాల్లో రాధా తప్పటడుగులు..! చౌరస్తాలో చంటిపిల్లాడిలా మారిన పరిస్థితి..!!

రాజకీయాల్లో రాధా తప్పటడుగులు..! చౌరస్తాలో చంటిపిల్లాడిలా మారిన పరిస్థితి..!!

బెజవాడ వాడ రాజకీయాల్లో వంగవీటి రాధా అయోమయ పరిస్తితిని ఎదుర్కొంటున్నారు. గమ్యం లేని ప్రయాణంలా కొనసాగుతోంది రాదా రాజకీయ ప్రస్థానం. రాజకీయాల్లో నిలవాలంటే... రాణించాలంటే... వ్యూహ-ప్రతివ్యూహాలు పన్నడం, ఎత్తుగడలు వేయడం తెలియాలి. జనం నాడిని పసిగట్టగల, భవిష్యత్ రాజకీయ పరిణామాలను అంచనా వేయగల 'జ్యోతిష్యం' ఎంతోకొంత తెలిసుండాలి. వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా దశాబ్ద కాలానికి ముందే ముందుకొచ్చిన వంగవీటి రాధాకృష్ణ... ఎందుకోగానీ, తండ్రికి తగిన తనయుడని అనపించుకోలేకపోతున్నారు, మెప్పించలేకపోతున్నారు.

 ఫ్యాన్ గాలిని పసిగట్టలేక పోయిన రాధా..! బెజవాడ రాజకీయాల్లో ప్రేక్షక పాత్ర..!!

ఫ్యాన్ గాలిని పసిగట్టలేక పోయిన రాధా..! బెజవాడ రాజకీయాల్లో ప్రేక్షక పాత్ర..!!

కాపు నేతగా, వంగవీటి మోహనరంగా రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రాధా... తన రాజకీయ ప్రస్థానంలో చాలా తప్పులే చేశారని స్వయంగా ఆయన అభిమానులే గుసగుసలాడుకుంటున్నారు. పేదలుర, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సాగిన రంగా ఆశయ సాధనే తన లక్ష్యమంటూ నిత్యం చెప్పుకునే రాధా... ఆ దిశగా చేసిన ప్రయత్నాలు శూన్యం. ఇటీవలి కాలతంలో ఆయన చేసిన రాజకీయపరమైన తప్పిదాలు... ఆయన రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చాయి.

 జగన్ తో ఉంటే ప్రభుత్వంలో కీలక పదవి..! కావాలని కష్టాలు తెచ్చుకున్న రాధా..!!

జగన్ తో ఉంటే ప్రభుత్వంలో కీలక పదవి..! కావాలని కష్టాలు తెచ్చుకున్న రాధా..!!

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా.... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీలో రాధాకు బాగానే ప్రాధాన్యం దక్కిందని కూడా చెప్పాలి. ఎందుకనోగానీ... తన తండ్రిని పొట్టనబెట్టుకున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీలో చేరిపోయారు. రాధా రంగా మిత్రమండలినే ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ నిర్ణయంపై మిత్రమండలిలోనే పెద్ద చీలిక వచ్చిందన్న వార్తలు కూడా వినిపించాయి. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధాకు... టీడీపీ అధినేత చంద్రబాబు మొండి చేయిచ్చారు.

  ఈసారి గట్టిగా కొడదాం .. నిరాశ పడకండి
   మరో ఐదేళ్లు ఖాళీ..! ఎదురుచూడక తప్పని పరిస్థితులు..!!

  మరో ఐదేళ్లు ఖాళీ..! ఎదురుచూడక తప్పని పరిస్థితులు..!!

  ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతినడంతో రాధా పరిస్థి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే రాధా మరో తప్పటడుగు వేశారు. ఇప్పటికే టీడీపీకి బాగా దూరమైన ఆయన... జనసేనలో చేరిపోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు పర్యాయాలు ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు కూడా. జనసేనలో చేరే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తన తండ్రి జయంతి రోజున కూడా తన భవిష్యత్తు రాజకీయంపై మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. రాధా మౌనం వెనుకనున్న ఆయన అంతరంగంపై చర్చలు సాగుతున్నాయి.

  English summary
  Vangavitti Radhakrishna, who came forward a decade ago as a political successor, because he is not worthy of his father Ranga.Radha, who has made his entry as a Kapu leader and a desperately political successor himself, his fans are whispering that he has made many mistakes in his political career.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X