వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు గట్టి షాక్: కేసీఆర్‌కు చుక్కలు చూపిన వంటేరు కాంగ్రెస్‌లోకి, ఎర్రబెల్లి అల్లుడు కూడా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో మరో గట్టి షాక్. పలువురు కీలక నేతలు టీడీపీని వీడి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరుతున్నారు. ఇప్పుడు మరో రెండు వికెట్లు పడనున్నాయి. వంటేరు ప్రతాప్ రెడ్డి, మదన్ మోహన్ రావులు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.

ఆ పదవి వద్దు, నాకు ఎన్నో హామీలిచ్చారు, నా మాట వింటే సరే.. నేనే సీఎం: కాంగ్రెస్‌పై రేవంత్ సంచలనంఆ పదవి వద్దు, నాకు ఎన్నో హామీలిచ్చారు, నా మాట వింటే సరే.. నేనే సీఎం: కాంగ్రెస్‌పై రేవంత్ సంచలనం

వంటేరు ప్రతాప్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో టీడీపీకి కీలక నేత. గజ్వెల్‌లో ఆయనకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా మంచి పట్టు ఉంది. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వంటేరు పోటీ చేసి టీఆర్ఎస్‌లో వణుకు పుట్టించారు. ఓ సమయంలో వంటేరు చేతిలో కేసీఆర్ ఓడిపోతారనే వాదనలు వినిపించాయి.

 ఈ నెల 18న కాంగ్రెస్‌లోకి వంటేరు

ఈ నెల 18న కాంగ్రెస్‌లోకి వంటేరు

అలాంటి వంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 18వ తేదీన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశ్యంతోనే ఆయన పార్టీ మారుతున్నారని భావిస్తున్నారు.

 ఇలా టీడీపీ దెబ్బతింటోంది

ఇలా టీడీపీ దెబ్బతింటోంది

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ కొంత దెబ్బతిన్నది. ఓటుకు నోటు కేసు తర్వాత మరింత దెబ్బతిన్నది. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనతో పాటు చాలామంది ముఖ్య నేతలు నడిచారు. ఆ సమయంలోనే వంటేరు కూడా కాంగ్రెస్‌లో చేరుతారని భావించారు.

 కాంగ్రెస్‌లోకి ఎర్రబెల్లి మేనల్లుడు

కాంగ్రెస్‌లోకి ఎర్రబెల్లి మేనల్లుడు

కానీ, రేవంత్ కాంగ్రెస్‌లో చేరిన చాన్నాళ్లకు ఆయన కూడా అదే బాట పట్టనున్నారు. వంటేరు శుక్రవారం అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నారని భావించారు. కానీ మరికొందరిపాటు ఈ నెల 18న చేరనున్నారు. ఆయనతో పాటు మరో టీడీపీ నేత మధన్ మోహన్ రావు కూడా కాంగ్రెస్ జెండా పట్టుకోనున్నారు.

 ఏపీపై చంద్రబాబు దృష్టి

ఏపీపై చంద్రబాబు దృష్టి

మధన్ మోహన్ రావు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు అల్లుడు. ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జహీరాబాద్ నుంచి పోటీ చేశారు. చంద్రబాబు ఏపీపై దృష్టి సారించడంతో పాటు తెలంగాణలో టీడీపీ పట్టు కోల్పోతుందనే ఉద్దేశ్యంతోనే వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారని చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగైనట్లేనని విపక్షాలు అంటున్నాయి.

English summary
Telugudesam Party leaders Vanteru Pratap reddy and Madan Mohan Reddy to join Congress soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X