వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులదే మైండ్‌గేమ్, రాత్రే ఫోన్ వచ్చింది: ఆర్కే క్షేమంపై వరవరరావు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విశాఖ: మావోయిస్టు అగ్రనేత ఆర్కే, ఇతర నేత విషయంలో పోలీసులే తమతో మైండ్ గేమ్ ఆడారని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోపించారు. ఆపరేషన్ ఆర్కే పేరుతో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల ఆచూకీ చెబితే.. కోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంటామని తెలిపారు.

ఆర్కే ఆచూకీ కోసం గత పది రోజుల నుంచి అందరూ ఎదురుచూశారని అన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉండి ఉంటే ఆందోళన చెంది ఉండేవాళ్లం కాదని అన్నారు. ఆపరేషన్ ఆర్కే అంటూ గందరగోళానికి గురిచేశారని అన్నారు.

ఓ ఎస్పీ స్థాయి పోలీస్ ఆఫీసర్.. గాదెర్ల రవి కుటుంబానికి ఫోన్ చేసి.. 'రవి మృతదేహాన్ని తెచ్చుకోండి' అని వారికి చెప్పారని అన్నారు. దీంతో ఎంతో ఆందోళనకు గురైన రవి కుటుంబసభ్యులు వెలిచాల నుంచి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నారని చెప్పారు. అయితే అక్కడి పోలీసు అధికారులు మాత్రం రవి చనిపోలేదని, మీరు వెళ్లిపోవచ్చని చెప్పారని.. దీంతో ఆ కుటుంబం మళ్లీ వెనక్కి వచ్చిందని వరవరరావు తెలిపారు.

దాదర్ల రవి సోదరుడు సారయ్య, ఆయన సహచరిని అడవిలోనే పోలీసులు కాల్చి చంపారని చెప్పారు. కాగా, చలపతి క్షేమంగా ఉన్నాడని, ఆర్కే గాయపడి ఎన్ కౌంటర్ స్థలంలోనే ఉన్నాడని డీజీపీ, మావో నేత కైలాసం చెప్పడంతో తాము ఆందోళనకు గురయ్యాని తెలిపారు.

నవంబర్ 2న జగబంధు పేరుతో ఆడియో వచ్చిందని, తాము క్షేమంగా ఉన్నామని అందులో చెప్పారని వరవరరావు తెలిపారు. అయితే, తాము వారిలో ఆర్కే ఉన్నామని గ్రహించలేదని చెప్పారు. ఆ తర్వాత గురువారం రాత్రి తమకు ఫోన్ చేసి.. ఆర్కే కూడా క్షేమంగా ఉన్నాడని చెప్పడంతో తమకు స్పష్టత వచ్చిందని తెలిపారు. అయితే, మావో నేతలు ఎక్కడున్నారనే విషయం తనకు అవసరం లేదని చెప్పారు.

పిటిషన్ ఉపసంహరించుకున్న ఆర్కే భార్య

ఆర్కే భార్య తన భర్త ఆర్కే ఆచూకీ తెలపాలంటూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు హైకోర్టు శుక్రవారం అనుమతించింది. దీంతో ఆమె పిటిషన్‌ను ఆమె తరపు న్యాయవాది రఘునాథ్ ఉపసంహరించుకున్నారు. ఆర్కే క్షేమంగా ఉన్నారని కోర్టుకు రఘునాథ్ తెలియజేశారు. వరవరరావుకు ఫోన్ చేసి ఆర్కే క్షేమంగా ఉన్నారని మావోయిస్టులు చెప్పిన నేపథ్యంలో పిటిషన్ ఉపసంహరించుకున్నారు.

English summary
Varavara Rao on Friday responded on RK missing issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X