విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒంటరై పోయాను: ఏడ్చేసిన వరవరరావు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రముఖ రచయిత, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత చలసాని ప్రసాద్ భౌతికకాయాన్ని చూసి విప్లవ కవి వరవరరావు బోరున విలపించారు. ఒక మహానేతను కోల్పోయామని కన్నీరు పెట్టారు. నాటి నక్సల్‌బరీ ఉద్యమం నుంచి దండకారణ్య ఉద్యమం వరకు తన రక్తమాంసాలను పణంగా పెట్టి పోరాడారని అన్నారు.

తన శరీరం, హృదయంలో భాగమైన చలసాని తనను విడిచి వెళ్లిపోయాడని, తానిప్పుడు ఒంటరినైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. చలసాని ప్రసాద్‌కు ప్రముఖులు, రచయితలు, వామపక్ష నేతలు ఆదివారం అంతిమ వీడ్కోలు పలికారు. ‘చలసాని ప్రసాద్‌ అమర్‌రహే' అంటూ నినాదాలు చేశారు. రచయితలు, అభ్యుదయవాదులు, అభిమానులు ఆదివారం ఉదయం ఆయన నివాసం వద్ద సంతాప సభను నిర్వహించారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వామపక్షాల ప్రముఖులు, విరసం నేతలు, రచయితలు భారీగా తరలివచ్చారు. చలసానితో తమకున్న అనుబంధాన్ని తలుచకొని కంటతడి పెట్టారు. పేదల పక్షపాతిగా నిలిచిన ఆయన చిరస్మరణీయుడని కొనియాడారు.

కంట తడి పెట్టిన వివి

కంట తడి పెట్టిన వివి

ప్రముఖ విప్లవ కవి, విరసం నేత చలసాని ప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి, బోరున విలపించారు. చలసాని ప్రసాద్ మరణంతో తాను ఒంటరై పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నీటి వీడ్కోలు..

కన్నీటి వీడ్కోలు..

చలసాని ప్రసాద్ మృతికి ప్రముఖ విప్లవ కవి వరవర రావు తీవ్రంగా కదిలిపోయారు. దుఖ్కాన్ని నిలువరించుకోలేకపోయారు.

అంతిమ వీడ్కోలు...

అంతిమ వీడ్కోలు...

విప్లవ రచయిత చలసాని ప్రసాద్‌కు రచయితలు, కవులు, అభిమానులు, వామపక్ష వాదులు అంతిమ వీడ్కోలు పలికారు.

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి...

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి...

ప్రముఖ విప్లవ రచయిత తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కృషి చేశారు. అందరికీ ఆత్మబంధువుగా నిలిచారు. ఆయన చివరకు తనువు చాలించారు.

హరగోపాల్ నివాళి..

హరగోపాల్ నివాళి..

పౌర హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ హరగోపాల్ చలసాని ప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిచారు. ఒక స్నేహితుడు, ఆత్మీయ బంధువును కోల్పోయానని పౌరహక్కుల నేత హరగోపాల్‌ అన్నారు. ఇంకా అనేక మంది ప్రముఖులు చలసానితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు.

దుఖ్కసాగరంలో ముంచి...

దుఖ్కసాగరంలో ముంచి...

మిత్రులను, సహ రచయితలను వదిలేసి చలసాని ప్రసాద్ వెళ్లిపోయారు. కృష్ణాబాయి తదితరులు ఆయనకు అంతిమ వీడ్కోలు చెప్పారు.

విరసం సభ్యుల ఆవేదన.

విరసం సభ్యుల ఆవేదన.

చలసాని ప్రసాద్ మృతికి విరసం నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన భౌతిక కాయాన్ని చూసి విలపించారు.

విలువలను కాపాడ్డమే...

విలువలను కాపాడ్డమే...

చలసాని విలువలను, సంస్కరణలను కొనసాగించడమే ఆయనకిచ్చే గౌరవమని ప్రముఖ సాహిత్య విమర్శకుడు, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె. శ్రీనివాస్ అన్నారు.

ఆంధ్ర వైధ్య కళాశాలకు...

ఆంధ్ర వైధ్య కళాశాలకు...

చలసానికి కడసారి నివాళులు అర్పించి, భౌతికకాయంతో అంతిమయాత్ర నిర్వహించారు. జీవించి ఉండగా చలసాని కోరుకున్న విధంగా ఆయన పార్థివదేహాన్ని ఆంధ్రా వైద్య కళాశాలకు అప్పగించారు.

English summary
An eminent revolutinary poet Varavara Rao wept like a child seeing Chalasani Prasad's dead body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X