వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకెందుకెళ్లారు: జగన్‌కు వర్ల, సభతో సమస్య: జగ్గారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Varla and Jagga Reddy fire at YSRCP
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఢిల్లీకి అన్నిసార్లు ఎందుకు వెళ్లారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య బుధవారం మండిపడ్డారు. ఢిల్లీలోని పెద్దలు జగన్ పార్టీకి దిశానిర్దేశనం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. లోడీ హోటల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో సమావేశమై అక్కడి నుండి జంతర్ మంతర్ ధర్నాకు వెళ్లారన్నారు.

ఓ ఖైదీ బెయిల్ పైన విడుదలైతే జగన్నాథ రథయాత్రతో పోల్చడం హిందూ మతాన్ని కించపర్చడమేనన్నారు. హిందూ మతంపై విశ్వాసం లేనంత మాత్రాన హైందవులను కించపర్చేలా రాయడం తగదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీ అధిష్టానం సూచల మేరకే నడుచుకుంటోందన్నారు.

జగ్గా రెడ్డి ఫైర్

వైయస్ జగన్ హైదరాబాదులో సమైక్య సభ పెట్టి శాంతిభద్రతల సమస్యను సృష్టించాలని చూస్తున్నారని సంగారెడ్డి శాసన సభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే ప్రజల్లో ప్రాంతీయ విభేదాలు పెరిగాయని, జగన్ సభతో మరింత పెరగవచ్చునన్నారు.

తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యు టర్న్ తీసుకుందని ఆరోపించారు. మొదటి నుండి ఆ పార్టీ నేతలు సమైక్యవాదులే అన్నారు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడతామని అందరూ లేఖలు ఇచ్చాకనే సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుందన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడమేమిటని, హైదరాబాదులో జగన్ సభ పెట్టడం సరికాదన్నారు.

English summary
TDP leader Varla Ramaiah and Sanga Reddy MLA Jagga Reddy fired at YSRCP and party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X