వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్: బాబు సహనం పరీక్షించొద్దని వర్ల వార్నింగ్, మూడు.. జేసీ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహనాన్ని కేంద్రం పరీక్షిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య గురువారం అన్నారు. అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్ పైన వర్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Recommended Video

Union Budget 2018 : Jaitley Disappointes AP | Oneindia Telugu

ఏంటిది!: బడ్జెట్‌పై బాబు తీవ్ర అసంతృప్తి, త్యాగానికి సిద్ధమని సుజనా, 'చాలా దుర్మార్గం'ఏంటిది!: బడ్జెట్‌పై బాబు తీవ్ర అసంతృప్తి, త్యాగానికి సిద్ధమని సుజనా, 'చాలా దుర్మార్గం'

చంద్రబాబు ఇప్పటికీ సహనంతో వ్యవహరించారని ఆయన చెప్పారు. ఆయన ఓర్పును పరీక్షించవద్దని హెచ్చరికగా మాట్లాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంపై విజయసాయి రెడ్డి ఫైర్: జగన్ చెప్తే రాజీనామా, కానీ మెలిక, విశాఖలో నిరసనకేంద్రంపై విజయసాయి రెడ్డి ఫైర్: జగన్ చెప్తే రాజీనామా, కానీ మెలిక, విశాఖలో నిరసన

 బడ్జెట్‌పై హరిబాబు

బడ్జెట్‌పై హరిబాబు

కేంద్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చే విధంగా ఉందని బీజేపీ విశాఖపట్నం ఎంపీ హరిబాబు అన్నారు. ఏపీకి నష్టం జరగలేదన్నారు. విభజన చట్టంలోని పేర్కొన్న అయిదు సంస్థలు రావాల్సి ఉందని, సెంట్రల్, గిరిజన వర్సిటీలకు నిధులు కేటాయించారని చెప్పారు.

రైల్వే జోన్‌పై

రైల్వే జోన్‌పై

విభజన చట్టంలో రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలపైనే అరుణ్ జైట్లీ ప్రస్తావించారని హరిబాబు చెప్పారు. అధికారుల నివేదికతో సంబంధం లేకుండా రైల్వే జోన్‌పై రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

 చెప్పుకోవడానికి ఏమీ లేదు

చెప్పుకోవడానికి ఏమీ లేదు

కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందని కాంగ్రెస్ ఎంపీ టీ సుబ్బరామి రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రస్థావన, పునర్విభజన చట్టంలోని అంశాలను ప్రస్థావించకపోవటం అన్యాయమన్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీలేని బడ్జెట్లో మిగిలేది అసంతృప్తే అన్నారు.

మూడు నామాలు, బాబు స్థాయి మరిచి తిరిగినా

మూడు నామాలు, బాబు స్థాయి మరిచి తిరిగినా

బడ్జెట్‌లో ఏపీకి మూడు నామాలు పెట్టినట్టుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైట్లీ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిని మరిచి కేంద్రం చుట్టూ తిరిగినా ప్రయోజన లేకుండా పోయిందని వాపోయారు.

English summary
Telugu Desam Party leader Varla and MP JC Diwakar Reddy hot comments on Union Budget 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X