విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బస్సులో పాటలు వింటున్న యువకుడిపై వర్ల అభ్యంతరకర వ్యాఖ్యలు, కంగుతిన్న అధికారులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గురువారం నోటి దురుసు ప్రదర్శించారు. ఓ యువకుడిని కులం పేరుతో దూషించారు. ఆర్టీసీ చైర్మన్‌గా అధికారుల పని తీరును పర్యవేక్షించాల్సిన అతను కాలక్షేపం కోసం బస్సులో పాటలు వింటున్న యువకుడిపై అభ్యంతరక పదజాలం ఉపయోగించారు.

పవన్ కళ్యాణ్ పార్టీలో చేరకుండా అందుకే బీజేపీలోకి!: చంద్రబాబుపై మాధవీలత ఫైర్పవన్ కళ్యాణ్ పార్టీలో చేరకుండా అందుకే బీజేపీలోకి!: చంద్రబాబుపై మాధవీలత ఫైర్

వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండులో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బస్సులో కిటీకీ పక్కన కూర్చొని కాలక్షేపం కోసం తన ఫోన్లో పాటలు వింటున్న యువకుడిపై అనుచిత పదజాలం ఉపయోగించారు.

 ఫోన్లో పాటలు వింటున్న యువకుడిని కులం పేరుతో

ఫోన్లో పాటలు వింటున్న యువకుడిని కులం పేరుతో

అధికారులు, ఇతర నేతలతో కలిసి వర్ల రామయ్య ఆ యువకుడి వద్దకు వెళ్లారు. ఫోన్లో పాటలు వింటున్న ఆ యువకుడిని పట్టుకొని నువ్వు మాలనా, మాదిగనా అని అడిగారు. మాదిగలు అసలు చదువరంటూ కూడా దుర్భాషాలాడారని తెలుస్తోంది. వర్ల రామయ్య యువకుడిని కులం పేరుతో దూషించడాన్ని గమనించిన అధికారులు, ఆయనతో పాటు ఉన్న నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వర్ల వ్యాఖ్యలతో అందరూ ఖంగు తిన్నారు. కాసేపు ఆ యువకుడికి వర్ల క్లాస్ పీకారు.

 ఈ లోకంలో లేకుండా ఫోన్ లోకంలో ఉంటే ఎలా?

ఈ లోకంలో లేకుండా ఫోన్ లోకంలో ఉంటే ఎలా?

ఇంటర్మీడియేట్ చదువుతున్న ఈ యువకుడు ఈ లోకంలోనే లేకుండా ఉంటే ఎలాగని (పాటలు వింటూ ఆ లోకంలో ఉండటాన్ని ఉద్దేశించి) వర్ల రామయ్య అన్నారు. చుట్టుపక్కల పరిశీలించాలని అంటుంటారని, కానీ అతను ఈ లోకంలోనే లేడని వ్యాఖ్యానించారు.

 మాలనా, మాదిగనా స్పష్టంగా చెప్పాలని ప్రశ్న

మాలనా, మాదిగనా స్పష్టంగా చెప్పాలని ప్రశ్న

నీది ఏ కులం అని అడగగా ఆ యువకుడు తాను ఎస్సీని అని చెప్పాడు. దానికి వర్ల స్పందిస్తూ.. మాలనా, మాదిగనా వివరంగా చెప్పాలన్నాడు. దానికి ఆ యువకుడు తాను మాదిగ అని చెప్పాడు. మాదిగలు అసలు చదవరని వ్యాఖ్యానించారు. ఆ యువకుడిని పలు వివరాలు అడిగారు వర్ల. మీ అయ్య ఏం చేస్తాడని, మీ అమ్మ ఏం చేస్తుందని ప్రశ్నించారు. తన తండ్రి పేయింటర్ అని అతను చెప్పాడు. బ్యాంకులో ఎన్ని లక్షలు ఉన్నాయని, పొలం ఎంత ఉందని కూడా అడిగాడు.

 ఫోన్ ఇస్తే సగం చెడగొట్టినట్లే

ఫోన్ ఇస్తే సగం చెడగొట్టినట్లే

ఫోన్ ఇస్తే సగం చెడగొట్టినట్లేనని, ఏం లేకుండా ఎలా చదువుకుంటావని అడిగారు. తల్లిదండ్రులకు తోడుగా సెలవుల్లో కూలీ పనికి వెళ్లాలని సూచించారు. కాగా, ఓ వైపు ఆర్టీసీ మర్యాద వారోత్సవాలు నిర్వహించింది. ఆర్టీసీ చైర్మన్ యువకుడిని కులం పేరుతో దూషించడం కలకలం రేపుతోంది.కాగా, దీనిపై వర్ల రామయ్య ఆ తర్వాత వివరణ ఇచ్చారు. అతను తన సాటి కులస్తుడు అని చెప్పారు. ఆ యువకుడికి మంచి చెప్పానే తప్ప కించపర్చడం తన ఉద్దేశ్యం కాదన్నారు. తాను అతడిని దూషించలేదని, కుల పెద్దగా నాలుగు మంచి మాటలు చెప్పానన్నారు.

English summary
Andhra Pradesh RTC Chairman Varla Ramaiah shocking on youth in Krishna district's Machilipatnam Bus Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X