వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్రభుత్వ మొదటి కట్టడం ఇదే: ఫోటో ట్వీట్‌తో వర్ల రామయ్య సెటైర్

|
Google Oneindia TeluguNews

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వ తీరును, జగన్ పరిపాలన అసమర్ధతను ఎండగడుతున్న ఆయన జగన్ సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కట్టిన మొట్టమొదటి కట్టడం అంటూ ఒక గోడ ఫోటో పెట్టి ఏపీ ప్రభుత్వానికి చురకలంటించారు వర్ల రామయ్య.

చాకలి ఐలమ్మ స్పూర్తితోనే.. బంగారు తెలంగాణ: హరీష్ రావుచాకలి ఐలమ్మ స్పూర్తితోనే.. బంగారు తెలంగాణ: హరీష్ రావు

గత ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారన్న కక్షతో రహదారికి అడ్డంగా గోడ కట్టారు వైసిపి కార్యకర్తలు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో టీడీపీ కార్యకర్తలు అక్కడికి దగ్గరలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లే మార్గంలో అడ్డుగా గోడ నిర్మించారు వైసీపీ మద్దతుదారులు . ఇక వైసీపీ కార్యకర్తలు నిర్మించిన గోడ టిడిపి సానుభూతిపరులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అసౌకర్యంగా మారింది. ఈ దారుణంపై టీడీపీ కార్యకర్తలు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. సమస్యను తేలికగా తీసుకోవడంతో టిడిపి నాయకులు పోలీసులను ఆశ్రయించారు . కానీ అప్పటికే వైయస్ఆర్సిపి మద్దతుదారులు నాలుగు అడుగుల గోడను పెంచి నిర్మించారు.

Varla Ramaiah tweeted a photo saying this was the first construction of Jagans government

దీంతో వర్ల రామయ్య రోడ్డుకు అడ్డంగా కట్టిన ఆ గోడ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసి జగన్ ప్రభుత్వం వచ్చాక కట్టిన మొట్ట మొదటి కట్టడం ఇదేనని విమర్శించారు. ఇక అంతే కాదు తాజ్ మహల్ దేశ ప్రగతికి చిహ్నమైతే, ఈ గోడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. తాజ్ మహల్ ను అందరూ ఆస్వాదిస్తుంటే... ఈ గోడను ప్రతి ఒక్కరూ ఈసడించుకుంటున్నారని పేర్కొన్నారు వర్ల రామయ్య. అక్రమ కట్టడమైన ఈ గోడ ప్రభుత్వ అసమర్థతను ప్రతిబింబిస్తోందని చెప్పిన ఆయన దళితుల మధ్య అగాధానికి కారణమైన ఈ గోడను పడగొట్టాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని కోరారు. దీంతో ఇప్పుడు వర్ల రామయ్య చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
English summary
Telugu Desam Party leader Varla Ramaiah criticizes YSR Congress chief and AP CM YS Jagan Mohan Reddy. Varala Ramaiah, said that it was the first building to be built after Jagan's rule was started and he tweeted a photo of a wall in the middle of the road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X