వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్షిత అత్యాచారం.... నిందితుడి అరెస్ట్... గతంలోను చిన్నారులపై అత్యాచారం చేసిన ఘనుడు

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత హత్యకేసును పోలీసులు చేధించారు. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తిని లారీ డ్రైవర్ రఫీగా పోలీసులు గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరికాసేపట్లో నిందితున్ని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే రఫీ గత చరిత్ర కూడ నేరమయంగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో రఫీపై పలుకేసులు నమోదు కావడంతో రెండు నెలలు జైలు శిక్షకూడ అనుభవించినట్టు తెలుస్తోంది.

పెళ్ళికి వెళ్లిన హర్షితపై అత్యాచారం

పెళ్ళికి వెళ్లిన హర్షితపై అత్యాచారం

నవంబర్ ఎనిమిదవ తేదిన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బి.కోత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారీ వర్షితను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసిన సంఘటన తెలుగు రాష్ట్రంలో సంచలనం రేపింది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన వర్షితకు చాక్లేట్ ఆశ చూపి తనవెంట తీసుకెళ్లిన దుండగుడు రఫీ ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి , హత్యకు పాల్పడ్డాడు. అనంతరం ఆదివారం తెల్లవారుజామున అదే కళ్యాణమండం సమీపంలో వర్షిత శవాన్ని పడేసి వెళ్లిపోయాడు. కాగా చిన్నారీపై అత్యాచారం చేసి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే మృతి చెందిందని డెత్ రిపోర్ట్‌లో డాక్టర్లు వెల్లడించారు. వర్షిత హత్యకు గురైన

హత్యతో అలర్ట్ అయిన పోలీసులు

హత్యతో అలర్ట్ అయిన పోలీసులు

చిన్నారీ హత్యతో అలర్ట్ అయిన మదనపల్లి పోలీసులు వెంటనే సంఘటనస్థలంలోని సీసీ కెమేరాలను పరీశీలించారు. ఆ వీడియో వర్షిత వెంట ఓ వ్యక్తి తిరుగుతూ ఫోటోలు తీసుకోవడం గమనించారు. దీంతో వీడియోలో ఉన్న వ్యక్తిని చిత్తూరు జిల్లా బసినికోండకు చెందిన రఫీగా గుర్తించారు. రఫీ ఓ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా రఫీకి గతంలో నేర చరిత్ర కూడ ఉండడంతో ఆయనపై నిఘా పెంచారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు రఫీ అదుపులోని తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది.

 రఫీ గత చరిత్ర కూడ నేరమయమే...

రఫీ గత చరిత్ర కూడ నేరమయమే...

కాగా వర్షితపై అత్యాచారం చేసిన రఫీ గత చరిత్ర కూడ నేరమయంగా ఉన్నట్టు తెలుస్తోంది. పదేళ్ల క్రితమే ఆరేళ్ల చిన్నారీపై అత్యాచార యత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఆ కేసులో రెండు నెలల పాటు జైలు శిక్ష కూడ అనుభవించినట్టు చెప్పారు. ఇక ఏడాది క్రితం మరో 12 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులు కూడ నమోదైనట్టు తెలిపారు. దీంతో పాటు పలువరు బాలికల పట్ల దురుసుగా ప్రవర్తించడం లాంటీ ఆరోపణలను కూడ మహ్మద్ రఫీ ఎదుర్కోన్నట్టు జిల్లా పోలీసులు తెలిపారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు

వర్షిత హత్య జరిగిన అనంతరం చిత్తూరు జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సైతం స్పందించారు. నిందుతున్ని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు పలు టీంలను ఏర్పాటు చేశారు. రఫీపై నిఘాపెట్టి నేడు ఉదయం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

English summary
Accused was arrested who raped and murder the five yers old girl varshita in a marriage function in chittoor district and he will be produced in the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X