చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాసన్ ఐ కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్ అనుమానాస్పద మృతి

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడుకు చెందిన వాసన్ ఐ కేర్ స్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్(51) సోమవారం అనుమానాస్పదస్థతిలో మరణించారు. అయితే, మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, అరుణ్‌కు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అయితే, అప్పటికే అరుణ్ మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. కాగా, ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆయనది సాధారణమే. అయితే, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Vasan Eye Care founder Dr AM Arun, 51, dies in Chennai

అరుణ్ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఓమందురర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. 'అతను (డాక్టర్ అరుణ్) తన ఇంటిలో కదలలేని స్థితిలో ఉన్నాడు, దీంతో ఆస్పత్రికి తరలించారు. అతనిది ఆత్మహత్య కాదు' అని ఒక సీనియర్ పోలీసు అధికారి పిటిఐకి చెప్పారు.

తిరుచిరపల్లిలోని తన కుటుంబం చిన్న వైద్య దుకాణాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా తన వృత్తిని ప్రారంభించిన అరుణ్.. 60 సంవత్సరాల వ్యవధిలో పలు ప్రదేశాలలో కంటి సంరక్షణ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను నిర్మించాడు.

వాసన్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, వాసన్ మెడికల్ సెంటర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లను కలిగి ఉన్న హెల్త్‌కేర్ గ్రూప్.. ఆదాయపు పన్ను శాఖ శోధనలను ఎదుర్కొంది. అంతేగాక, విచారణకు సంబంధించిన అప్పీల్‌ను మద్రాస్ హైకోర్టులో కూడా దాఖలు చేశారు.

అరుణ్ అకాల మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తమిళనాడు శివగంగ నుంచి కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ, కార్తీ పి చిదంబరం.. అరుణ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

English summary
Vasan Eye Care founder Dr AM Arun, 51, dies in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X