జగన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వాసిరెడ్డి, ఏం చెప్పాము !
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ కు ఆ పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. వరుస రాజీనామాలతో జగన్ కు నిద్ర లేకుండా పోయింది. ఇప్పుడు వైసీపీ మహిళా నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి బయటకు వెలుతూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వాసిరెడ్డి పద్మ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు బిత్తరపోయారు. ఏదో వైసీపీలో పదవి ఇచ్చారని తాను ఇంతకాలం ఆ పార్టీకి భజన చేశానని వాసిరెడ్డి పద్మ పరోక్షంగా అన్నారు. వైసీపీలో మహిళలకు ప్రాధాన్యత లేదని వాసిరెడ్డి పద్మ ఓపెన్ గా చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా పని చేశానని అన్నారు.

ఆ సందర్భంలో తాను ఏ విషయం చెప్పినా, మహిళలను న్యాయం చేయాలని అడిగినా జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి తాను జగన్ ప్రభుత్వానికి చెప్పినా వాళ్లు ఏమీ పట్టించుకోలేదని, మహిళలకు ఏమాత్రం న్యాయం చేయలేదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు తాను పార్టీలో ఉన్న మహిళలకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయానని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. గతంలో జగన్ కు, వైసీపీ నాయకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పినా వాళ్లు ఏ మాత్రం పట్టించుకోలేదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. వైసీపీలో ఆ పార్టీ కోసం తాను చాలా కష్టపడి పనిచేశానని, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేసిన సమయంలో తాను సూచించిన సలహాలను అప్పటి జగన్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
వైసీపీపై విరక్తి చెందడంతో ఆ పార్టీకి రాజీనామా చేశానని, రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ తో పాటు ఆ పా శరర్యాలయానికి పంపించానని వాసిరెడ్డి పద్మ అన్నారు. వైసీపీలో వరసగా ఆ పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా వైసీపీకి చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైసీపీ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు.












Click it and Unblock the Notifications