• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొండ‌త అనుభ‌వం కొండెక్కిన‌ట్టేనా..! ఏపీ కాంగ్రెస్ ఆశా 'కిర‌ణం' అస్త‌మ‌య‌మేనా...??

|

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : ఆ కిరణం ఉమ్మ‌డి రాష్ట్రం దేదీప్య‌మానంలో వెలిగిపోయింది. ఊహించ‌ని శిఖ‌రాల‌ను అందుకుంది. రాష్ట విభ‌.న త‌ర్వాత అనూహ్యంగా మ‌స‌క‌బారింది. ఆ కిరణం పేరే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఎన్నికల వేళ కూడా ఈ మాజీ ముఖ్య‌మంత్రి అనుభ‌వం ఏపి కాంగ్రెస్ పార్టీకి ప‌నికొచ్చేలా క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌లు ముంచుకొస్తున్నా ఏపి కాంగ్రెస్ కి ఆయ‌న అనుభ‌వం ఏమాత్రం ప‌నికి రావ‌డంలేదు. పార్టీలో త‌న అనుభ‌వాల‌తో జోష్ నింపాల్సిన కిర‌ణ్ కుమార్ రెడ్డి ఎందుకు స్త‌బ్దుగా ఉంటున్నార‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

డ్రీం క్యాబినెట్ - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019

 ఏపిలో ప‌నికి రాని కిర‌ణ్ అనుభ‌వం..! నిరాశ‌లో పార్టీ క్యాడ‌ర్..!!

ఏపిలో ప‌నికి రాని కిర‌ణ్ అనుభ‌వం..! నిరాశ‌లో పార్టీ క్యాడ‌ర్..!!

2014 ఎన్నికల తరువాత మూడున్నరేళ్లపాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్‌, ఎనిమిది నెలల క్రితమే కాంగ్రెస్‌ గూటికి తిరిగి చేరారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై అభిమానులు, అనుచరులు పెద్ద యెత్తున అంచానాలు పెట్టుకున్నారు. కాని పాక్టీ శ్రేణుల అంచ‌నాల చేర‌కు కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయ అనుభ‌వం ఏపి లో ప‌నిచేయ‌క‌పోవ‌డం ప‌ట్ల క్యాడ‌ర్ అసంత్రుప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 కిర‌ణ్ సోద‌రుడు టీడిపిలోకి..! నిలువునా చీలిన కుటుంబం..!!

కిర‌ణ్ సోద‌రుడు టీడిపిలోకి..! నిలువునా చీలిన కుటుంబం..!!

ఏడాది క్రితం కిరణ్‌ సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. కొన్నాళ్ల తరువాత, కాంగ్రెస్‌ పెద్దల ఆహ్వానంతో మాతృ ఒడికి కిరణ్‌ చేరారు. దీంతో, నల్లారి కుటుంబం రాజకీయంగా నిలువునా చీలినట్టయింది. కాంగ్రెసులో చేరిన తరువాత రెండుసార్లు తన నియోజకవర్గంలో కిరణ్‌ పర్యటించారు. రాజకీయ విమర్శలకు తావివ్వకూదని అనుకున్నట్టున్నారు. నగిరిపల్లె లోని స్వగృహానికి దూరంగా, కలికిరిలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో బస చేశారు. అనుచరులు, అభిమానులతో గడిపారు.

సొంత‌నియోజ‌క వ‌ర్గానికి కూడా దూరం..! అస‌లు కిర‌ణ్ మ‌న‌సులో ఏంముందంటున్న ఫాన్స్..!!

సొంత‌నియోజ‌క వ‌ర్గానికి కూడా దూరం..! అస‌లు కిర‌ణ్ మ‌న‌సులో ఏంముందంటున్న ఫాన్స్..!!

కలికిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో పర్యటించారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని, కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యమని అంటూ అనుచరుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఇప్పటికే ఓ మోస్తరులో సాగిస్తున్నప్పటికీ తమ నేత మాత్రం గుంభనంగా ఉండడం వారిని అయోమయానికి గురిచేస్తోంది. ఫోన్లకు కూడా అందుబాటులోకి రాకపోవడంతో నియోజకవర్గ రాజకీయాల్లో తమ పరిస్థితి ఏమిటో అంతుబట్టక అయోమ‌యంలో పడ్డారు. రాష్ట్రంలో టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ స్నేహపూర్వకంగా వ్యవహరించడం కిరణ్‌ కుమార్ రెడ్డికి ఏమాత్రం నచ్చలేదనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

కంటిలో న‌లుసులా సోద‌రుడి రాజ‌కీయాలు..! అందుకే కిర‌ణ్ మౌనం అంటున్న అనుచ‌రులు..!!

కంటిలో న‌లుసులా సోద‌రుడి రాజ‌కీయాలు..! అందుకే కిర‌ణ్ మౌనం అంటున్న అనుచ‌రులు..!!

తన సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పటికే కుటుంబంలో స్పర్థలు ఏర్పడడం, ఈ ఎన్నికలతో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం ఇష్టం లేకనే కిరణ్ కుమార్ మౌనం పాటిస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే నల్లారి కుటుంబ అభిమానుల్లో అత్యధికులు టీడీపీ నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి వెంట వెళ్లిపోయారు. టీడీపీలోకి వెళ్లలేని వారు మాత్రమే కిరణ్‌తో ఉన్నారు. తన వద్ద నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తావించిన కొంతమంది సన్నిహితులతో ‘ఈసారికి మీ ఇష్టం' అంటూ, కిరణ్‌ కాసింత తాత్వికంగా సమాధానమిచ్చారట. ఈ కిరణం, మబ్బుల మాటు నుంచి బయటికొచ్చేదెన్నడో... ప్రకాశించేది ఎప్పటికో...? అనే ప్ర‌చారం ఏపి కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.

English summary
Kiran, who has been away from active politics for three and a half years after the 2014 elections, rejoined the Congress eight months ago. In this context, he and his followers have made huge expectations on the political future. But the cadre seems unlikely about Kiran Kumar Reddy's lack of political experience in the performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X