వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండోసారి సెక్స్‌కు నో: చంపి పూడ్చేశాడు, చివరికిలా..

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాకినాడ:వివాహితపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను 16 రోజుల తర్వాత తూర్పుగోదావరి జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు ఎం. వీరసుబ్రమణ్యం ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడ్డారు. అయితే టెక్నాలజీ సహయంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

 Veera Subramanyam arrested for killing a woman

తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామానికిచెందిన వివాహితకు రంగంపేట మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన చెందిన ఎం. వీరసుబ్రమణ్యంతో పరిచయం ఉంది. మార్చి 18వ తేదిన సామర్లకోటలోని తన సోదరుడికి డబ్బులు ఇచ్చేందుకు వివాహిత బయలు దేరింది. ఈ విషయాన్ని వీరసుబ్రమణ్యంతో ఆమె చెప్పింది. అయితే ఆమెను సుబ్రమణ్యం బలభద్రపురంలో మోటార్‌సైకిల్‌పై తన పొలానికి తీసుకెళ్ళాడు.

పొలం వద్ద ఆమెతో శారీరకంగా కలిశాడు. కొద్దిసేపు కబుర్లు చెప్పుకొన్నారు. మరోసారి శారీరకంగా కలిసేందుకు ఆమెపై వీరసుబ్రమణ్యం ఒత్తిడి తెచ్చాడు. కానీ, ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై దాడి చేశాడు. దరిమిలా ఆమె స్పృహ కోల్పోయింది.

అయితే ఆమెను ఆసుపత్రిలో చేర్చితే అసలు విషయం బయటపడుతోందని భావించిన వీరసుబ్రమణ్యం ఆమెను గొంతు నులిమి చంపేశాడు.మృతదేహన్ని గోనెసంచిలో కట్టి చెరువు వద్ద తూములో పారేశాడు.

అయితే సోదరుడికి డబ్బులిచ్చేందుకు వెళ్ళిన భార్య ఆచూకీ లేకపోవడంతో వివాహిత భర్త పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో రాయవరం పోలీసులు దర్యాప్తులో వీరసుబ్రమణ్యం నిందితుడిగా తేలింది.

మృతురాలి ఫోన్‌ స్విచ్చాఫ్ చేసి ఉండడంతో ఆమె ఫోన్‌కు వచ్చిన చివరి కాల్ ఎవరిదో పరిశీలించారు. వీరసుబ్రమణ్యం నెంబర్ గా గుర్తించారు.

అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే వివాహితను హత్యచేసిన విషయాన్ని ఒప్పుకొన్నాడు. దీంతో అతడి ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహన్ని స్వాధీనం చేసుకొన్నారు.

English summary
M. Veera Subramanyam arrested for killed a woman at Rayavaram village in East Godavari district.A 40 year old woman murdered by Veera Subramanyam on March 18, 2018.Rayavaram police arrested M. Veera Subramanyam on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X