వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు అన్నిటికి డబ్బేనా: విజయమ్మ బోనస్‌పై వీరశివా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerasiva Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ ప్రతి అంశాన్ని డబ్బుతోనే ముడిపెడుతున్నారని కాంగ్రెసు పార్టీ కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. ఉద్యోగులు ఆందోళనలు చేసేది మీరిచ్చే బోనస్‌ల కోసం కాదని, సమైక్యాంధ్ర కోసమన్నారు.

తెలంగాణలో తుడిచి పెట్టుకుపోయింది కాబట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజను గట్టిగా కోరుకుంటోందన్నారు. సమైక్యాంధ్ర పేరుతో నాటకాలు ఆడుతున్నారన్నారు. అన్ని పార్టీలు కలిసి కాంగ్రెసు పార్టీని మోసం చేశాయని, లేఖల పైన ఆధారపడి నిర్ణయం తీసుకొని కాంగ్రెసు పార్టీ తప్పు చేసిందన్నారు. కాగా, తాము అధికారంలోకి వచ్చాక సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులకు బోనస్ ఇస్తామని విజయమ్మ చెప్పారు.

మంత్రులను అడ్డుకున్న ఉద్యోగులు

సచివాలయంలో సీమాంధ్ర మంత్రులను సీమాంధ్ర ఉద్యోగులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, తదితరులను, రాజీనామా చేసి కేబినెట్ సమావేశానికి ఎందుకు హాజరయ్యారని సీమాంధ్ర ఉద్యోగులు అడ్డుకున్నారు.

కెసిఆర్‌పై నన్నపనేని ఫైర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇతర తెరాస నేతలు సీమాంధ్రులను కించపరిస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో మేథావులే లేరంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.

ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల శ్రమను, ధనాన్ని దోచుకునే వారు ఏపాటి మేధావులో అందరికీ తెలుసునన్నారు. సీమాంధ్ర ప్రజల వల్లే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందనే అంశంపై కెసిఆర్‌తో బహిరంగ చర్చకు తాను సిద్దమన్నారు.

English summary

 Congress Party senior MLA Veerasiva Reddy on Friday fired at YSR Congress Party honorary president YS Vijayamma on her bonus comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X