వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విగ్రహాల మీద టీడిపికి ఎందుకు ఆగ్రహం..! వైయస్ విగ్రహాన్ని కూల్చిన చోటే ప్రతిష్టిస్థామన్న వైసీపి..!!

|
Google Oneindia TeluguNews

విజయవాడ/హైదరాబాద్ : అమరావతిలో విగ్రహాల రాజకీయం నడుస్తోంది. విజయవాడలో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని తర్వలోనే పునః ప్రతిష్ట చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం రామలింగేశ్వర నగర్‌ స్క్రూబ్రిడ్జి వద్ద వంగవీటి మోహనరంగా ఉద్యానవనాన్ని, విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పార్కును తొలగించే ప్రయత్నం చేసిందన్నారు. ఇప్పుడు మరలా పార్కును ప్రారంభించి.. మోహన రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Recommended Video

వాయిదా పడిన సీఎం జగన్ ప్రజా దర్బార్
Vellampalli Srinivasa Rao Inaguarated Vangaveti Mohan Ranga Park And Statue At Vijayawada.!

పేద ప్రజల కోసం రంగా చేసిన పోరాటాలు తమకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పించిన వంగవీటి మోహనరంగా అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వైఎస్ఆర్‌ విగ్రహాన్ని తర్వలోనే పునః ప్రతిష్ట చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

విజయవాడ నగరానికి తలమానికంగా ఉన్న పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుడా గత టీడిపి ప్రభుత్వం విగ్రహాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసిందని చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్దంగా ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించినప్పుడు, నిబంధనలకు లోబడి ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఎందుకు తొలంగించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

English summary
The YSR statue, which was removed by the TDP government in Vijayawada, will be restored in the near future, YSR Congress MP Vellampally Srinivasarao said. On Monday, he opened a bungalow and a statue at Ramalingeshwara Nagar Screwbridge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X