వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొప్ప ప్రయత్నం: బాలకృష్ణకు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలనేగాక ఉత్తర, దక్షిణాది ప్రాంతాలను పాలించిన గొప్ప శాతవాహన చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో నటిస్తున్న ప్రముఖ నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతిని రాజధానిగా చేసుకొని శాతవాహనులు పాలించారని ఆయన గుర్తు చేశారు. ఒక గొప్ప చక్రవర్తి చరిత్రను తెలుగు యువ తరానికి చూపించడానికి చేస్తున్న ఒక మంచి ప్రయత్నంగా.. ఈ సినిమాను వెంకయ్యనాయుడు అభివర్ణించారు.

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాసరావు సమర్పణలో ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో జరిగిన విషయం తెలిసిందే.

Venkaiah Congratulates Balakrishna for 'Gauthamiputra Satakarni'

ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ప్రముఖ నటుడు చిరంజీవి కెమేరా స్విచ్చాన్ చేయగా, సీఎం కేసీఆర్ క్లాప్ కొట్టారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు.

కాగా, ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. అన్నగారి (ఎన్టీఆర్) అభిమానిగా తాను సుప్రసిద్ధ నటుడు బాలకృష్ణకు హృదయపూర్వక ఆశీస్సులు పలుకుతున్నట్లు కె. చంద్రశేఖర రావు చెప్పారు. బాలకృష్ణ పేరును, ఎన్టీఆర్ ప్రశస్తిని కెసిఆర్ ప్రస్తావించినప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్ద యెత్తున హర్షధ్వానాలు చెలరేగాయి.

గౌతమీపుత్ర శాతకర్ణిపై సినిమా తీయడం చిన్న విషయం కాదని, శాతకర్ణి ఒక శకానికి నాందిపలికిన మహాపురుషుడని అన్నారు. తెలుగుజాతి క్రీ.శ., క్రీ.పూ. అని అనుకుంటుండేదని, గౌతమీ పుత్ర శాతకర్ణి తెలుగుజాతికి ఓ శకానికి నాంది పలికాడని ఆయనఅన్నారు.


తెలుగుజాతికి గుర్తుండిపోయే విధంగా బాలకృష్ణ ఈ సినిమా నిర్మించతలపెట్టడం గర్వించదగిన విషయమని ఆయన అన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి రెండు వందల రోజులు ఆడుతుందని కెసిఆర్ అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర అని ఆయన అన్నారు.

English summary
Central Minister Venkaiah Naidu congratulated Tollywood veteran actor Nandamuri Balakrishna for his career's landmark film 'Gauthamiputra Satakarni' .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X