చిచ్చుపెట్టేలా: జగన్‌పై పరోక్షంగా వెంకయ్య, నేను ఏపీ నుంచి గెలవకున్నా..
న్యూఢిల్లీ: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య అగాథం సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు గురువారం నాడు అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ సందర్భంగా టిడిపి - బీజేపీ మధ్య అగాథం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు వైసిపి అధినేత జగన్‌ను, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించి ఉంటారని అంటున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందున కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావాలని ఆ రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వైసిపి, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి అని అంటున్నారు.
అప్పుడు మాట్లాడకుండా..
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తానే నాడు రాజ్యసభలో నిలదీశానని అన్నారు. నాడు మాట్లాడాల్సిన సమయంలో ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు బిల్లులు అంటూ హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బిల్లు ఏం అవసరమని వారే చెప్పారని, ఇప్పుడు వారు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారన్నారు.
నేను ఏపీ నుంచి కాకపోయినా..
విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని వెంకయ్య చెప్పారు. దానికి కేంద్రం సహకరిస్తుందన్నారు. టిడిపి - బీజేపీ కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కొంతమంది రాజకీయ ఉద్దేశ్యంతో ఏవేవో వ్యాఖ్యలు చేస్తారని విపక్షాలను ఉద్దేశించి అన్నారు.
నాడు ఏపీకి అన్యాయం జరుగుతుంటే, ఏపీ నుంచి తాను ప్రాతినిథ్యం వహించనప్పటికీ, పక్క రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లినప్పటికీ, ఓ తెలుగువాడిగా ఏపీకి అన్యాయం జరుగుతుంటే చూడలేక ప్రత్యేక హోదా అడిగానని చెప్పారు. హోదా ఒక్కటే పరిష్కారం కాదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముందుకు వస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications