నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ మిత్రపక్షమే, కానీ: వెంకయ్య, టీడీపీకి షాకిచ్చేలా పురంధేశ్వరి వ్యాఖ్యలు

ఇటీవల తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య విమర్శలు చోటు చేసుకోవడంతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పార్టీ శ్రేణులకు హితవు పలికారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం/నెల్లూరు: ఇటీవల తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య విమర్శలు చోటు చేసుకోవడంతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పార్టీ శ్రేణులకు హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ మనకు మిత్ర పార్టీ అని, అయితే, వచ్చే ఎన్నికల సంగతి గురించి ఇప్పుడే మాట్లాడవద్దని సూచించారు.

శనివారం ఆయన నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకయ్య మాట్లాడుతూ... కేంద్రం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే నేతలంతా కలిసి పనిచేయాలన్నారు.

బలోపేతం కావాలి

బలోపేతం కావాలి

ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే కమ్యూనిస్టులకు ఒక్క సీటూ రాలేదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. వారసత్వం లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేదని, వైసీపీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందేనని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

చట్టంలో ఎందుకు పెట్టలేదు?, రోడ్లపైనే వధిస్తారా?

చట్టంలో ఎందుకు పెట్టలేదు?, రోడ్లపైనే వధిస్తారా?

విభజన అంశాలను ఎందుకు చట్టం చేయలేదో ఏ పీలో సభ పెడుతున్న కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కేరళలో విపక్షాలు నడిరోడ్డుపై ఆవును వధించడం సమంజసమా?. అని మంత్రి ప్రశ్నించారు. అలాగే పశుమాంసాన్ని విచ్చలవిడిగా విదేశాలకు తరలిస్తున్నందునే కేంద్రం కొన్ని నిబంధనలు తీసుకొచ్చిందన్నారు.

2019 ఎన్నికలకు మేం సిద్ధం: పురంధేశ్వరి

2019 ఎన్నికలకు మేం సిద్ధం: పురంధేశ్వరి

విశాఖపట్టణం: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని మాజీ కేంద్రమంతి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. శనివారం విశాఖలో బీజేపీ ఉత్తరాంధ్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... ఏపీలో జరిగే అభివృద్ధిలో సింహభాగం కేంద్రానిదేనన్నారు.

టీడీపీ పొత్తు ఉంటుందా?

టీడీపీ పొత్తు ఉంటుందా?

అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విశాఖలో జరిగిన భూదందాపై సమగ్ర దర్యాప్తు చేయించాలని పురందేశ్వరి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పురంధేశ్వరి వ్యాఖ్యలను గమనిస్తే టీడీపీతో పొత్తు లేకుండానే.. బీజేపీ సొంతంగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది.

English summary
Union minister Venkaiah Naidu and BJP leader Purandheswari on Saturday responded on 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X