వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్‌లో వెంకయ్యకు చేదు అనుభవం: సారీ చెప్పిన ఫ్రాన్స్ మంత్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫ్రాన్స్ పర్యనటలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఓ విమానయాన కంపెనీ చేసిన నిర్వాకం వల్ల ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్‌ నగరంలో జరిగిన 22వ అంతర్జాతీయ ఇంటలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌సిస్టమ్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌కు ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు.

Venkaiah Naidu's flight ticket cancelled at 11th hour, travels by road in France

ప్రాన్స్ విమానంలో ఆయన ఇందుకోసం అక్కడ టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, విమానంలో ఆయన కోసం రిజర్వు చేసిన టికెట్‌ను ఎయిర్‌ ఫ్రాన్స్‌ అధికారులు 11వ గంటలో రద్దు చేశారు. దీంతో భారీ వర్షంలో దాదాపు 600 కిలో మీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి బోర్డెక్స్‌లో జరిగిన ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

దీంతో ఈ సంఘటనపై ఫ్రాన్స్‌ రవాణా మంత్రి అలెస్‌ స్పందించి వెంకయ్యకు క్షమాపణ చెప్పారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వెంకయ్య నాయుడు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

English summary
Union minister M Venkaiah Naidu, who is on a visit to Paris to take part in a global meet on transport, on Monday accused Air France of "irresponsible behaviour" for cancellation of his confirmed booking at the eleventh hour due to which he had to travel nearly 600 kms by road amid heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X