వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ‌కీయ అరంగేట్రం కోసం ఉత్సాహం చూపుతున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి వార‌సుడు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు వార‌సులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి బేదం లేకుండా అంద‌రి వార‌సులు రాజ‌కీయాల్లో త‌మ జాతాకాన్ని ప‌రిక్షించుకునేందుకు స‌న్నాహాలు చేసుంకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్క్రుతి తారా స్థాయికి చేరుతోంది. ఇంత‌కాలం చందువుల పేరుతో, వ్యాపారాల పేరుతో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న నేత‌ల వార‌సులు ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అందులో ఉప‌రాష్ట్ర‌ప‌తి వార‌సుడికి కూడా మిన‌హాయింపు ఏమీలేదు. ఉప‌రాష్ట్ర‌ప‌తి వార‌సుడి రాజ‌కీయ‌ అరంగేట్రం గురించి తెలుసుకుందాం..!!

వెంక‌య్య శ‌కం ముగిసిన‌ట్టే..!! రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న త‌నుయుడి ఉత్సాహం..!

వెంక‌య్య శ‌కం ముగిసిన‌ట్టే..!! రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న త‌నుయుడి ఉత్సాహం..!

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనయుడు హర్షవర్థన్‌ నాయుడు రాబోయే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, ఇందుకోసం వేగంగా పావులు కదుపుతున్నారని, తన తండ్రిపై ఒత్తిడి తీసుకువస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు హర్షవర్థన్ నాయుడును వ్య‌క్తిగ‌తంగా అతి ద‌గ్గ‌ర‌నుండి గమనించిన బీజేపీ నేతల నుంచి కూడా ఈ వార్త నిజమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవల కొంత కాలంగా వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్ నాయుడు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న వెంక‌య్య‌..!

రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న వెంక‌య్య‌..!

దీనిలో బాగంగానే ఆయన కేంద్రంలోని బిజెపి పెద్దలకు మద్దతు పలుకుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్రానికి బిజెపి చాలా మంచి చేసిందని, ఇంకా చేస్తుంటుందని, రాష్ట్ర పాలకుల వైఫల్యం కారణంగానే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని ఆయన తన సన్నిహితుల వద్ద విమర్శలు చేస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయ నాయకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరు తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపక్షంలో కీల కంగా వ్యవహరించిన వెంకయ్య నాయుడు ఆంధ్రాకు ప్రత్యేకహోదా కావాలని పోరాడి కేంద్రాన్ని ఒప్పించిన విషయం తెలిసిందే. తరువాతి కాలంలో హోదా విషయాన్ని బిజెపి పెద్దలు పక్కకు పెట్టిన విషయం కూడా తెలిసిందే.

వెంకయ్య పాత్ర ముగిసిపోయింది..! రాజకీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..!!

వెంకయ్య పాత్ర ముగిసిపోయింది..! రాజకీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..!!

అయినా ఆయన కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్రానికి చాలా సహాయం చేశారనే చ‌ర్చ జ‌రుగుతోంది. అలాగే వెంకయ్య కేంద్ర మంత్రిగా వుండి ఉంటే ఆంధ్రా పరిస్థితి మరోలా ఉండేదేమోననే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తుంటాయి. అయితే ప్రధాని మోదీ ఆయన చేత మంత్రి పదవికి రాజీనామా చేయించి, ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటుంన్నారు. అయితే ఈ పరిణామాల నేపద్యంలో రాజకీయాల్లో వెంకయ్య పాత్ర ముగిసిపోయిందంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన తనకుడు హర్షవర్దన్‌ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

వార‌సున్ని తీసుకోస్తారా..? ఇంకా స‌మ‌యం ఉంద‌ని నాన్చుతారా..!!

వార‌సున్ని తీసుకోస్తారా..? ఇంకా స‌మ‌యం ఉంద‌ని నాన్చుతారా..!!

ఇప్పటివరకూ వెంకయ్య కుమారుడు కానీ, కుమార్తె కానీ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారనే వార్తలు ఎప్పుడూ వెలువడలేదు. వెంకయ్య కుమార్తె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, కుమారుడు వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ‘హర్షా' టయోటా, హోట‌ల్స్ తదితర వ్యాపారాలను ఆయన నిర్వహిస్తు న్నారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాల‌ని గ‌ట్టి సంక‌ల్పంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా వెంకయ్యకు పిఎస్‌గా పని చేసిన సత్య కూడా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని సమాచా రం. వచ్చే ఎన్నికల్లో రాజంపేట సీటు తనకు ఇప్పించాలని ఆయన వెంకయ్యపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి వెంకయ్య ఈ విషయంలో ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

English summary
India's Vice-President Venkaiah Naidu's son Harshavardhan Naidu is keen to play a key role in the forthcoming elections,For this, the fast pokes are moving, and the news that he is pressing his father for political entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X