వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌తో మాట్లాడుతున్నాం, కంట్రోల్ చేసుకోవాలి: బాబు, ఎన్టీఆర్ గాలి వీచినా...

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో భేటీపై మాట్లాడుతున్నామని, ఇంకా తేదీ ఖరారు కావాల్సి ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం చెప్పారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చిస్తామన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో భేటీపై మాట్లాడుతున్నామని, ఇంకా తేదీ ఖరారు కావాల్సి ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం చెప్పారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చిస్తామన్నారు.

వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంపై చంద్రబాబు స్పందించారు. వెంకయ్యను ఎంపిక చేసిన విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు.

సంతోషమే కానీ

సంతోషమే కానీ

ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ఆనందంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. అయితే, అంత అనుభవజ్ఞుడైన నేత, మనకు అండగా ఉండే వ్యక్తి మనకు దూరమవుతుంటే కొంత లోటుగా కూడా ఉంటుందన్నారు. అయితే, ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చినప్పుడు, ఉన్నత పదవులు వచ్చినప్పుడు ఆహ్వానించి ముందుకు వెళ్లాలన్నారు.

సాయం చేస్తారు కానీ..

సాయం చేస్తారు కానీ..

ఇన్నాళ్లూ ఎంతో అండగా ఉన్న వెంకయ్యకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఉప రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆయన సాయం చేయడానికి పెద్ద ఆటంకం ఉంటుందని తాను అనుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. అయితే, ఉప రాష్ట్రపదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో, తదనంతర పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి ఎంతో అండగా నిలిచారని చంద్రబాబు అన్నారు.

Recommended Video

Pawan Kalyan Seeks Chandrababu Naidu Appointment
కంట్రోల్ చేసుకోవాలి

కంట్రోల్ చేసుకోవాలి

రాజకీయాల గురించి మాట్లాడే వ్యక్తి, ఉన్నపళంగా వాటిని వదులుకోవాలంటే కొంచెం ఇబ్బంది అని చంద్రబాబు అన్నారు. వెంకయ్య జీవనం మొత్తం రాజకీయాలే అన్నారు. అలాంటి వ్యక్తి ఉన్నపళంగా రాజకీయాలను కట్ చేసుకోవాలంటే చాలా సమస్యలు ఉంటాయని, చాలా కంట్రోల్ చేసుకోవాలన్నారు.

ఈ పరీక్షలో పాసవుతారు

ఈ పరీక్షలో పాసవుతారు

వెంకయ్యకు ఇది ఒక పెద్ద పరీక్ష, ఈ పరీక్షలో ఆయన పాసవుతాడని చంద్రబాబు అన్నారు. దాని గురించి అనుమానం అవసరం లేదన్నారు. దక్షిణాదిన వెంకయ్య లాంటి గొప్ప వ్యక్తి మరొకరు లేరన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన పోరాడే వ్యక్తి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పని చేసి జాతీయస్థాయికి ఎదిగారన్నారు.

ఆయనతో ఇదీ నా అనుబంధం, ఎన్టీఆర్ గాలి వీచినప్పుడు గెలుపు

ఆయనతో ఇదీ నా అనుబంధం, ఎన్టీఆర్ గాలి వీచినప్పుడు గెలుపు

వెంకయ్యతో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 1978లో తాను, వెంకయ్య ఒకేసారి శాసనసభకు వెళ్లామనీ, అప్పుడు ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ పార్టీని గజగజలాడించారని చెప్పారు. 1983లో టిడిపి గాలి వీచినప్పుడూ ఆయన గెలిచారన్నారు. ఆగస్టు సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్టీఆర్‌కు అండగా నిలిచి పోరాడారన్నారు. వెంకయ్య ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదన్నారు. విద్యార్థి నాయకుడిగా జై ఆంధ్ర ఉద్యమంలోనూ, ఎమర్జెన్సీలోనూ పోరాటాలు చేసి, జైలుకు వెళ్లారని చెప్పారు.

English summary
Andhra Pradesh chief minister N Chandrababu Naidu has congratulated Union minister M Venkaiah Naidu on being nominated as NDA candidate for the post of Vice-President of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X