బెదిరింపులకు ఎవరూ లొంగరు, ఐదేళ్ల తర్వాత ప్రశ్నించండి: వెంకయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో కేంద్రంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. బెదిరింపులకు ఎవరూ లొంగరని, చౌకబారు విమర్శలు చేయడం సరి కాదని ఆయన శుక్రవారం తెలంగాణలోని శంషాబాద్ మండలం ముచ్చింతలలో మీడియాతో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని, ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. తాము చెప్పింది చేయకపోతే ఐదేళ్ల తర్వాత ప్రశ్నించాలని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం న్యాయం చేసే విషయం నిరంతర ప్రక్రియ అని ఆయన చెప్పారు. అమృత పథకం కింద ఎపి రాజధాని అమరావతిని చేర్చినట్లు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాలకు సహాయం చేస్తామని ప్రధాని మోడీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాదును సుందర నగరంగా తీర్చి దిద్తుతామని ఆయన హామీ ఇచ్చారు.

బెదిరింపులకు ఎవరూ లొంగరు, ఐదేళ్ల తర్వాత ప్రశ్నించండి: వెంకయ్య
శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో స్వర్ణభారత్ ట్రస్ట్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు భూమిపూజ చేశారు. ఆ తర్వాత ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.

బెదిరింపులకు ఎవరూ లొంగరు, ఐదేళ్ల తర్వాత ప్రశ్నించండి: వెంకయ్య
స్వర్ణభారత్ ట్రస్ట్‌లో యువతకు ఉచితంగా శిక్షణ కల్పిస్తామని తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్టుకు విష్ణురాజు చైర్మన్‌గా ఉన్నారు. ట్రస్టుకు తమ అమ్మాయి మేనేజింగ్ ట్రస్టీగా ఉంటుందని తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్టు ప్రతినెల వైద్యశిబిరం నిర్వహిస్తుందని చెప్పారు

బెదిరింపులకు ఎవరూ లొంగరు, ఐదేళ్ల తర్వాత ప్రశ్నించండి: వెంకయ్య
మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని, మన సంప్రదాయాలపై యువతకు అవగాహన కల్పించాలని అన్నారు. చిన్నారుల్లో భక్తిప్రపత్తులు, ఆధ్యాత్మిక భావన కలిగించాలని, భవిష్యత్‌లో ఫార్మా పాఠశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వర్ణభారతి ట్రస్టుద్వారా కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

బెదిరింపులకు ఎవరూ లొంగరు, ఐదేళ్ల తర్వాత ప్రశ్నించండి: వెంకయ్య
నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పారు. యువతలో ఉన్న తెలివితేటలను సానబెడితే వృద్ధిలోకి వస్తారని వెల్లడించారు. సమాజం మనకు ఎంతో ఇస్తుంది. ఆ సమాజానికి మనం కొంతైనా తిరిగి ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications