వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపరాష్ట్రపతి వెంకయ్య మార్క్: ప్రత్యేక హోదా నినాదం - చరిత్రలో నిలిచిపోయేలా..!!

|
Google Oneindia TeluguNews

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగుస్తోంది. ఈ నెల 10న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదించిన ధన్ కర్ గెలుపొందారు. ఈ నెల 11న ఆయన నూతన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే వెంకయ్య నాయుడు పదవీ విరమణ తరువాత ఢిల్లీలోనే మరో నివాసం లో ఉండేందుకు ఒక భవనం కేటాయించారు. అయితే, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం.. అయిదేళ్లుగా ఉప రాష్ట్రపతిగా.. రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్య నాయుడు తన మార్క్ చూపించారు.

రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్య

రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్య


ఛైర్మన్ హోదాలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం నాలుగు సమావేశాల్లో 36 రోజుల పాటు సభ కార్యకలాపాలను అడ్డుకుంది. 2018 బడ్జెట్‌ సమావేశాల్లో అత్యధికంగా 24 సార్లు ఇది సభ స్తంభించిపోవడానికి దారితీసింది. 2021 శీతాకాల సమావేశాల్లో 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడం వంటివి వెంకయ్యనాయుడి హయాంలో వివాదాస్పదంగా మారాయి. రాజ్యసభ ఛైర్మన్ గా తన అయిదేళ్ల పదవీ నిర్వహణ పైన వెంకయ్య నాయుడు రాజ్యసభ 2017-2022..ఒక వీక్షణం' అనే పుస్తకాన్ని రూపొందించారు. రేపు (సోమవారం) ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.

సభా నిర్వహణలో తన మార్క్

సభా నిర్వహణలో తన మార్క్


ఛైర్మన్ హోదాలో సభ్యులతకు తమ మాతృభాషల్లో మాట్లాడేందుకు వెంకయ్య ప్రోత్సాహం అందించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు ఇప్పటివరకు 13 పూర్తి సెషన్స్‌కి నేతృత్వం వహించారు. 289 రోజులకు గానూ సభ 261 రోజులు సమావేశమైంది. 913 గంటల 11 నిమిషాలు సభ జరిగింది. ఈ 13 సెషన్స్‌లో 177 బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో 36 సిట్టింగ్స్‌ వాయిదా పడ్డాయి. 2014 లో రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా పైన నాటి రాజ్యసభ లో విపక్ష నేత హోదాలో వెంకయ్య నాయుడు పట్టు బట్టారు. ఆయన ఛైర్మన్ గా ఉన్న సమయంలోనే ఇదే నినాదం పైన సభలు మాలు మార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

Recommended Video

సీజేఐ రమణకు గౌరవ డాక్టరేట్ *trending | Telugu OneIndia
ఏపీకి ప్రత్యేక హోదా- కీలక బిల్లుల వేళ

ఏపీకి ప్రత్యేక హోదా- కీలక బిల్లుల వేళ


ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ సవరణ, వివాద్‌ సే విశ్వాస్‌, సామాజిక భద్రత కోడ్‌, అద్దె గర్భ నియంత్రణ బిల్లు వంటివి వెంకయ్య ఛైర్మన్ గా ఉన్న సమయంలో ఆమోదం పొందిన చరిత్రాత్మక బిల్లులుగా నిలిచాయి. సభలో సభ్యులకు సమయం కేటాయింపు.. మాట్లాడే అవకాశం.. సభా నిర్వహణ.. క్రమశిక్షణ..కఠిన వైఖరి వంటి విషయానల్లో అయిదేళ్ల కాలంలో రాజ్యజభ ఛైర్మన్ గా వెంకయ్య నాయుడు తన ముద్ర వేశారు. ఇక, ఈ సమావేశాల్లోనే వెంకయ్య నాయుడుకు సభ వీడ్కోలు పలకనుంది. నిత్యం.. ప్రజల్లో లేదా సభల్లో తన ప్రత్యేకత చాటిన వెంకయ్య నాయుడు ఈ నెల 10వ తేదీ తరువాత మాజీగా ఉంటారా.. లేక, తన కుటుంబానికి చెందిన స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలో భాగస్వాములవుతారా అనేది చూడాలి.

English summary
Venkaiah Naidu retires from the Rajyasabha Chairman position on 10th of this month, Venkaiah mark on sessions and decisions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X