వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఫుల్‌స్టాప్, పవన్ జనసేన బాగుంది: వేణుమాధవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Venu Madhav
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు వేణు మాధవ్ బుధవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పైన స్పందించారు.

రానున్న ఎన్నికల్లో తన పోటీ పైన తాను ఇప్పుడే చెప్పలేనని తెలిపారు. తాను పోటీ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతం నుండి అయినా పోటీ చేయగలనని, తనను అభిమానించే నటులు అన్ని ప్రాంతాలలో ఉన్నారని చెప్పారు. తనను అభిమానించే వారు పాకిస్తాన్‌లో ఉంటే అక్కడి నుండి కూడా పోటీకి సిద్ధమని చలోక్తి విసిరారు.

తనకు ఏ ఒక్క జిల్లాలోనో అభిమానులు లేరని చెప్పారు. దేవుడి దయ వల్ల ఇతర దేశాల్లో కూడా ఉన్నారన్నారు. తాను ఎక్కడి నుండి పోటీ చేస్తాననే అంశానికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెడతారన్నారు. తన పోటీ విషయమై చంద్రబాబు సమాధానం చెబుతారని తెలిపారు. తనకు రెండున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధముందని చెప్పారు.

పవన్ స్థాపించిన జనసేన పార్టీ పైన స్పందిస్తూ.... జనసేన ఆశయాలు తనకు ఎంతగానో నచ్చాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Tollywood comedian Venu Madhav met Telugudesam Party chief Nara Chandrababu Naidu on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X