వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర విభజన: సీనియర్ నాయకుల వైరాగ్యం?

|
Google Oneindia TeluguNews

Devineni Nehru and Budha Prasad
విజయవాడ: రాష్ట్ర విభజన, ప్రస్తుత రాజకీయ పరిణామాల మారుతున్న నేపథ్యంలో 2013లో కొందరు సీనియార్ రాజకీయ నాయకులు పార్టీలను మారేందుకు సన్నాహాలు చేసుకుంటుంటే.. మరికొందరు రాజకీయాలకే స్వస్తి పలికేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో కూడా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్లు తెలుస్తోంది. మూడు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగిన కొందరు జిల్లా సీనియర్ నాయకులు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు పార్టీలు మారేందుకు ఆసక్తి చూపుతుంటే.. మరికొందరు రాజకీయాల నుంచే వైదొలగేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర పార్టీల్లోకి వెళితే టికెట్ ఇస్తారో లేదోననే సందేహం ఉండడంతో పలువురు నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే రాష్ట్ర విభజన చేపడుతుండటంతో సీమాంధ్రలో గెలిచే అవకాశాలు తక్కువ కావడంతో ఆ పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు కూడా ఈ బాటలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ సినీయర్ నేతలైన మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు వచ్చే
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది.

కాగా మండలి బుద్ధ ప్రసాద్ మాత్రం తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. బుద్ధ ప్రసాద్ జిల్లాలోని అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ప్రాతినిథ్యం వహించారు. ఆయన తండ్రి దివంగత మండలి వెంకట కృష్ణారావు కూడా గతంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. యూపిఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలోనే తాను రాజకీయాల
నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.

మరో నేత, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) కూడా తన రాజకీయ జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తన కుమారుడి రాజకీయ అరంగేట్రం కోసమే ఆయన రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆయన కార్యకర్తలు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. కాగా ఆయన కుమారుడు దేవినేని అవినాశ్ ఇప్పటికే రాజకీయాల్లో చురుకుగా
వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే దేవినేని నెహ్రూ కృష్ణా జిల్లా నుంచి ఐదు సార్లు గెలిచిన ఏకైక నేతగా ఉండి, తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం తరపున నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నెహ్రూ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఒకసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే నెహ్రూ సన్నిహితులు మాత్రం, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం
ఉందని చెబుతున్నారు.

మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వర రావు కూడా ఇదే వైఖరిని అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. నిజాయితీ గల నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో జిల్లా నుంచి కీలక పాత్ర పోషించారు. ఆయన తండ్రి పిన్నమనేని కోటేశ్వరరావు జడ్పి ఛైర్మన్ పదవిలో కొనసాగారు. కాగా వ్యవసాయం, కో-ఆపరేటివ్ బ్యాంక్ కార్యకలాపాలకు పరిమితమైన వెంకటేశ్వరరావు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయరనే సంకేతాలను కార్యకర్తలకు పంపించినట్లు తెలుస్తోంది.

గన్నవరం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దాసరి బాలవర్ధన రావు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. తెలుగుదేశం అధిష్టానం ఇప్పటికే ఆయనను కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కో ఆపరేటివ్ ప్రొడ్యూసర్స్ సొసైటీ ఛైర్మన్‌గా నియమించింది. అయితే బాలవర్ధన్ మాత్రం రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నికల్లో పోటీ చేసేందుకు చివరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.

English summary
The year 2013 forced several senior politicians of the Krishna district to retire. Already some politicians have announced retirement and some of them planned to retire from politics after three decades of their long political journey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X